పండగ వేళ విషాదం చోటుచేసుకుంది. ఓలా ఎలక్ట్రిక్స్‌లో 38 ఏళ్ల ఉద్యోగి కె. అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు, 28 పేజీల సూసైడ్ నోట్ రాశాడు. అందులో కంపెనీ యజమాని భవేష్ అగర్వాల్ సహా పలువురు సీనియర్ అధికారుల పేర్లు ఉన్నాయి. తనను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించాడు. అయితే ఓలా మాత్రం మృతుడు ఎప్పుడు కూడా తన సమస్యలను ఎవరితోను చెప్పుకోలేదని, ఫిర్యాదు చేయలేదని తెలిపింది. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం, హోమోలోగేషన్ ఇంజనీర్ అయిన కె. అరవింద్ 2022 నుండి ఓలాలో పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 28న విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అరవింద్ బెంగళూరులోని చిక్కలసంద్ర నివాసి.
Also Read:K Ramp : 2 రోజుల్లో 11.3 కోట్లు
అరవింద్ మరణించిన కొద్దిసేపటికే, అతని సోదరుడు 28 పేజీల సూసైడ్ నోట్‌ను గుర్తించాడు. అందులో సుబ్రతా కుమార్ దాస్, భవేష్ అగర్వాల్ తనపై ఒత్తిడి తెచ్చి, మానసికంగా వేధించారని ఆరోపించారు. ఆ నోట్‌లో అరవింద్ కంపెనీలో తనను వేధించారని, జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని తెలిపారు. అరవింద్ సోదరుడు అక్టోబర్ 6న ఓలా యజమాని భవేష్ అగర్వాల్ తో పాటు మరికొందరి పై ఫిర్యాదు చేశాడు.
Also Read:PM Modi: బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించనున్న మోడీ.. ఎప్పటినుంచంటే..!
అరవింద్ మరణంపై స్పష్టత ఇస్తూ ఓలా ఒక ప్రకటన విడుదల చేసింది. “మా ఉద్యోగి అరవింద్ ఆకస్మిక మరణంతో మేము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాము. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి మా సానుభూతి తెలియజేస్తున్నాము. అరవింద్ గత మూడున్నర సంవత్సరాలుగా కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయన బెంగళూరు ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఆయన తన పదవీకాలంలో ఎటువంటి ఫిర్యాదులు చేయలేదు. కంపెనీ ఉన్నతాధికారులతో ఆయనకు పరిచయం లేదు” అని కంపెనీ చెబుతోంది. కర్ణాటక హైకోర్టులో ఎఫ్‌ఐఆర్‌ను సవాలు చేస్తామని ఓలా తెలిపింది.