మహారాష్ట్రలోని పూణెలో జరిగిన కారు యాక్సిడెంట్ దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మద్యం మత్తులో ఓ బాలుడు డ్రైవింగ్ కారణంగా ఇద్దరు టెకీలు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం కొన్ని గంటల్లోనే నిందితుడికి బెయిల్ రావడం.. ప్రమాదంపై న్యాయస్థానం వ్యాసం రాసుకుని రమ్మని చెప్పడం దేశ వ్యాప్తంగా విస్మయానికి గురి చేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు.. ఆందోళనలు వ్యక్తమవ్వడంతో ధర్మాసనం దిగొచ్చి.. నిందితులకు బెయిల్ రద్దు చేసింది. తాజాగా ఈ ఘటనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
ఇది కూడా చదవండి: Prajwal Revanna: ఇండియాకు రావడానికి ముందే ప్రజ్వల్ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్..
పూణె రోడ్డు ప్రమాదం కేసులో జువైనల్ జస్టిస్ బోర్డు వ్యవహారశైలి వివాదాస్పదంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మహిళా, శిశు అభివృద్ధి శాఖ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. మద్యం తాగి రోడ్డు ప్రమాదానికి కారణమైన బాలుడికి గంటల్లో బెయిల్ ఇవ్వడంపై విచారణ జరపనున్నారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకొన్న జువైనల్ బోర్డు అధిపతి డాక్టర్ ఎల్‌ఎన్ దన్వాడే పాత్రపై దర్యాప్తు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Shocking video: ఓ తల్లి క్రూరత్వం.. కన్న బిడ్డను ఏం చేసిందంటే..!
యాక్సిడెంట్ కేసు జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుటకు రాగానే 300 పదాలతో వ్యాసరచన చేయమనడం, 15 గంటలు ట్రాఫిక్ పోలీసులకు సాయం.. తదితర నిబంధనలతో తక్షణమే బెయిల్ ఇచ్చేసింది. ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా విమర్శలు మొదలయ్యాయి. దీంతో తిరిగి నిందితుడిని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు, డాక్టర్లు నిందితుడికి సాయం చేసినట్లు తేలడంతో.. ఇప్పుడు జువైనల్ బోర్డుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపడింది. దీంతో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఇది విచారణ జరిపి వచ్చే వారం మహిళా శిశు అభివృద్ధి శాఖకు నివేదికను సమర్పించనుంది.
ఇది కూడా చదవండి: PM Modi: “నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడంలో కుట్ర”.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు..