పరేడ్ గ్రౌండ్లో ఈనెల 13,14,15 కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు ఆబ్కారీ & టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సక్రాంతి పండుగను పురస్కరించుకుని ఫెస్టివల్ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేవిధంగా ఫెస్టివల్ ఉంటుందన్నారు. దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు, ప్రపంచంలో నీ చాలా దేశాల నుండి ఫెస్టివల్ లో పాల్గొంటారని తెలిపారు. 15 లక్షల మంది ప్రజలు పాల్గొంటారని అంచనా వేస్తున్నానన్నారు. 400 రకాల స్వీట్ ఈ ఫెస్టివల్ లో ఉంటాయని, ప్రపంచం ప్రజలను కలిపే విధంగా ఫెస్టివల్ ఉంటుందన్నారు. జిల్లా, మండల కేంద్రాలకు విస్తరింప చేయాలని భావిస్తున్నామని, తెలంగాణ, తెలుగు కళలకు పూర్వవైభవం చాటేలా ప్రభుత్వం కార్యక్రమాలు ఉంటాయన్నారు.
ఇదిలా ఉంటే.. సంక్రాంతి రద్దీ దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మధ్య మరో 6 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలు ముఖ్యంగాలో ఏపీకి ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో జనవరి 10 నుంచి 15వ తేదీ మధ్యలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు ఈ స్పెషల్ ట్రైన్స్ సర్వీసులను ఉపయోగించుకోవాలని కోరింది.