ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? జాబ్స్ కోసం సెర్చ్ చేసి అలసిపోయారా? అయితే డోంట్ వర్రీ. హిందుస్తాన్ పెట్రోలియంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 63 పోస్టులను భర్తీచేయనున్నారు. భర్తీకానున్న పోస్టుల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ 11, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ 17 , జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్ 06, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్01 , జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ & సేఫ్టీ 28 ఉన్నాయి.
Also Read:Zelenskyy: ‘‘త్వరలో పుతిన్ చనిపోతారు’’.. జెలెన్స్కీ సంచలన ప్రకటన..
అభ్యర్థులు పోస్టులను అనుసరించి మెకానికల్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ, ఫైర్ & సేఫ్టీలో ఉత్తీర్ణులై ఉండాలి. UR/ OBCNC/ EWS అభ్యర్థులకు కనీసం 60% మార్కులు, SC/ ST/ PwBD అభ్యర్థులకు 50% మార్కులు ఉండాలి. అభ్యర్థుల వయసు 25 ఏళ్లు కలిగి ఉండాలి. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), గ్రూప్ టాస్క్/గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రీ-ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఫిట్‌నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
Also Read:BJP: డీ లిమిటేషన్‌పై తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం.. బీజేపీ నాయకుల స్పందన
ఎంపికైన వారికి నెలకు రూ. 30,000 నుంచి రూ. 1,20,000 జీతం ఉంటుంది. దరఖాస్తు ఫీజు UR, OBCNC, EWS అభ్యర్థులు రూ. 1180 (GSTతో సహా) చెల్లించాలి. SC, ST, PwBD అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అప్లికేషన్ ప్రక్రియ మార్చి 26 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 30 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.