స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ మూడో రోజుకు చేరుకుంది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. దీంతో నేడు తెలుగు దేశం పార్టీ నేతలు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. చంద్రబాబు అరెస్టుపై భవిష్యత్ కార్యాచరణలపై ఈ సమావేశంలో టీడీపీ నాయకులు చర్చించనున్నారు. ప్రస్తుతం చంద్రబాబు హౌస్ రిమాండ్ పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది.
Read Also: TS Heavy Rains: వచ్చే మూడ్రోజులు రాష్ట్రంలో వర్షాలే.. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు
అయితే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజమండ్రిలో మకాం వేశాడు. ఇవాళ ( మంగళవారం ) రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యే అవకాశం ఉంది. స్నేహ బ్లాక్ లో ఉన్న చంద్రబాబుకు ఒక సహాయకుడు, ఐదుగురు జైలు భద్రత సిబ్బంది ఉంది. యోగా, వాకింగ్ అనంతరం జైలు గదిలోనే చంద్రబాబు ఉంటున్నారు. ఇక, చంద్రబాబుకు ఇంటి భోజనాన్ని వ్యక్తిగత సహాయకుడు తీసుకెళ్తున్నాడు. సెంట్రల్ జైలు సమీపంలోని విద్యానగర్ లోనారా లోకేష్ బస చేస్తున్నాడు. అయితే, నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఉదయం 5.40 గంటలకు నిద్ర లేచినట్లు జైలు సిబ్బంది తెలిపింది. మెడిటెషన్, యోగా చేసి.. అనంతరం న్యూస్ పేపర్ చదివి.. బ్లాక్ కాఫీ తాగినట్లు చెప్పారు.
Read Also: ICICI MD – CEO: ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ సీఈవోగా సందీప్ బక్షి.. ఆర్బీఐ ఆమోదం
ఇక, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. జైలు రిమాండ్‌ను హౌస్ అరెస్టుకు మార్చాలని దాఖలైన పిటిషన్‌పై నిన్న ( సోమవారం ) ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. సీఐడీ అధికారుల తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబుకు జైలులో ప్రాణహాని ఉందని, అందుకే హౌస్ రిమాండ్ కు మార్చాలని సిద్ధార్థ్ లూథ్రా వాదించారు.. అయితే.. దీనిపై ఏసీబీ కోర్టు ఇవాళ తుది తీర్పును వెల్లడించనుంది.