పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి దీనికి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనుంది. అని అడ్డంకులు తోలగి మొత్తనికి జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది.
Also Read : Venu : ‘ఎల్లమ్మ’ మూవీ పై అప్డేట్ ఇచ్చిన దర్శకుడు వేణు..
దీంతో ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టింది చిత్ర బృందం. ఇప్పటికే విడుదలైన పోస్టర్, వీడియో గ్లింప్స్, రెండు పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పుడు మూడో పాట కూడా విడుదల కానుండటంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇందులో భాగంగా ‘అసురుల హననం’ పేరుతో ఈ పాటను మే 21వ తేదీన ఉదయం 11:55 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో పాటు ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇక తాజాగా పవణ్ కల్యాణ్ కీరవాణి ని కలిసి సన్మానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఈ వీడియో లో పవన్ మాట్లాడిన ప్రతి ఒక్క మాట సినిమా పై ఆసక్తి వంద శాతం పెంచింది.