Devara-NTR: ‘దేవర’ భయాన్ని పోగొడతాడా?.. లేదా మరింత భయపెడతాడా?
- రాజమౌళి సెంటిమెంట్
- దేవరకు హిట్ సెంటిమెంట్
- ఎన్టీఆర్ భయాన్ని పొగొడతాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంకొన్ని గంటల్లో దేవర తుఫాన్ థియేటర్లను ముంచెత్తనుంది. ఈ నేపథ్యంలో ‘దేవర’ ఏం చేస్తాడు? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అలాగే ఎస్ఎస్ రాజమౌళి ఫ్యాన్స్ కూడా దేవర రిజల్ట్ కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్‌తోనే మొదలైంది.. ఎన్టీఆర్‌తోనే ఎండ్ అవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే రాజమౌళితో ఓ హీరో సినిమా చేసిన తర్వాత.. ఆ తర్వాతి సినిమా ఫ్లాప్ అవుతుంది. అది ఎన్టీఆర్‌తోనే మొదలవగా.. రాజమౌళి హీరోలకు బ్యాడ్ సెంటిమెంట్‌గా మారింది.
దర్శకుడిగా రాజమౌళి ప్రయాణం ఎన్టీఆర్‌తో మొదలైంది. స్టూడెంట్ నెం.1 సినిమా హిట్ అవగా.. ఆ తర్వాత ఎన్టీఆర్ చేసిన ‘సుబ్బు’ ఫ్లాప్ అయింది. ‘సింహాద్రి’ తర్వాత వచ్చిన ‘ఆంధ్రావాలా’ డిజాస్టర్ అయింది. ‘యమదొంగ’ తర్వాత చేసిన ‘కంత్రీ’ కూడా కొట్టుకుపోయింది. ఒక్క ఎన్టీఆర్ అనే కాదు.. ప్రభాస్‌తో సహా చాలామంది హీరోల పరిస్థితి ఇదే. దీంతో ఇప్పుడు ‘దేవర’ ఏం చేస్తాడు? అనేది ఆసక్తికరంగా మారింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా దేవర. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ కొరటాల లాస్ట్ ఫిల్మ్ ‘ఆచార్య’ ఫ్లాప్ అయింది. దీనికి తోడు రాజమౌళి సెంటిమెంట్ కూడా ఉంది. అయితే ఇప్పటివరకున్న ట్రెండ్ ప్రకారం దేవర సినిమా హిట్ అనే నమ్మకం అభిమానుల్లో ఉంది.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
Also Read: Prakash Raj: గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం! ప్రకాశ్ రాజ్ ట్వీట్ వైరల్
అలాగే దేవరకు రాజమౌళి సెంటిమెంట్‌తో పాటు ఒక హిట్ సెంటిమెంట్ కూడా ఉంది. ఇదే ఇప్పుడు దేవరను బ్యాలెన్స్ చేసేలా ఉంది. ఇప్పటివరకు మెగా హీరోలకు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్లు.. నెక్స్ట్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ‘అజ్ఞాతవాసి’ వంటి ఫ్లాప్ తర్వాత ‘అరవింద సమేత’తో త్రివిక్రమ్ శ్రీనివాస్ హిట్ కొట్టాడు. పవర్ స్టార్‌తో బాబీ తీసిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఫ్లాప్ కాగా.. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో తీసిన ‘జై లవకుశ’ హిట్ అయింది. ఇప్పుడు ‘ఆచార్య’ ఫ్లాప్ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. కాబట్టి ఖచ్చితంగా కొరటాల కంబ్యాక్ ఇస్తాడనే నమ్మకంతో ఫాన్స్ ఉన్నారు. దేవరకు హిట్ సెంటిమెంట్ కలిసొచ్చేలానే ఉంది. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయ్యేలానే ఉంది. దేవర ఇకపై రాజమౌళి హీరోల భయాన్ని పొగొడతాడా? లేదా మరింత భయపెడాతాడా? అనేది ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది.
తాజావార్తలు
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!