Jr NTR Tweet Wishing Mahesh Babu goes Viral: ఆగష్టు 9న బర్త్ డే వేడుకలు జరుపుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబుకి.. ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ ప్రముఖులంతా బర్త్ డే విష్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే.. అన్నింటిలో ఏ పోస్ట్ ఇవ్వని కిక్.. ఎన్టీఆర్ ట్వీట్ ఇచ్చిందనే చెప్పాలి. హ్యాపీ బర్త్ డే మహేష్ అన్నా.. అంటూ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. అన్న.. అంటూ విష్ చేయడమే కాకుండా.. ఈ ఏడాది అంతా మీకు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అని రాసుకొచ్చాడు. దీంతో.. మహేష్, తారక్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఈ ట్వీట్‌ని వైరల్ చేస్తున్నారు. మహేష్, ఎన్టీఆర్ మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకే.. మహేష్‌ని అన్న అని పిలుస్తుంటాడు ఎన్టీఆర్. దీంతో.. ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా ఇదే బాండింగ్ మెంటైన్ చేస్తుంటారు.
Mahesh Babu : ఇదెక్కడి లుక్ మావా? తగలబెట్టేసేలా ఉంది!
అందుకే.. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇకపోతే.. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరో వైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక గుంటూరు కారం తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు మహేష్. ప్రస్తుతం రాజమౌళి సినిమా మేకోవర్ అవుతున్నాడు. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికైతే.. ఈసారి మహేష్ బర్త్ డే నాడు ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని అనుకున్నారు. కానీ రాజమౌళి నుంచి ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు.