Mahesh Babu Red hot Look Released by Haarika & Hassine Creations : ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ ఓ రేంజ్‌లో చేసుకున్నారు ఘట్టమనేని అభిమానులు. ఈ సందర్భంగా.. మురారి సినిమా రీ రిలీజ్ చేయగా.. థియేటర్లన్నీ పెళ్లిళ్లు, అక్షింతలతో నిండిపోయాయి. మురారి సాక్షిగా కొన్ని జంటలు ఏకమై.. మహేష్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అయితే.. మహేష్ నుంచి మాత్రం ఎలాంటి కొత్త సినిమాల అప్డేట్స్ రాలేదు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రాజమౌళి సినిమా అప్డేట్ కూడా రాలేదు. ఈ విషయంలో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయినప్పటికీ.. హారిక హాసిని సంస్థ వారు రిలీజ్ చేసిన పోస్టర్ మాత్రం.. థియేటర్స్ తగలబెట్టేసేలా ఉంది. మహేష్ బాబుకి బర్త్ డే విష్ చేస్తూ.. గుంటూరు కారం నిర్మాణ సంస్థ హారిక హాసిని వదిలిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
Jathara : ‘జాతర’ ఫస్ట్ లుక్ పోస్టర్.. ఏంట్రా ఇలా ఉంది?
అయితే.. ఈ పోస్టర్ ఏ సినిమాలోనిది? అనేది అంతుపట్టకుండా ఉంది. గుంటూరు కారం సినిమా లోనిదా? అంటే అసలు కానే కాదు. ఎందుకంటే.. ఈ ఎరుపెక్కిన పోస్టర్‌లో రెండు చేతుల్లో రెండు కత్తులు పట్టుకొని పవర్ ఫుల్‌గా ఉన్నాడు మహేష్ బాబు. దీంతో.. ఈ పోస్టర్ ఏ సినిమా కోసం డిజైన్ చేసింది? అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తెలిసిన విషయం ఏంటంటే.. ఇది ‘గుంటూరు కారం’ మొదలు కాకముందే, మహేష్ బాబుతో త్రివిక్రమ్ స్టార్ట్ చేసిన యాక్షన్ మూవీ లోనిది.. అని తేలింది. వాస్తవానికైతే.. గుంటూరు కారం ప్లేస్‌లో మహేష్ కోసం పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీ ప్లాన్ చేశారు మాటల మాంత్రికుడు. కానీ మహేష్ ఎందుకనో.. ఫ్యామిలీ సినిమా చేద్దామని చెప్పడంతో.. మాస్ సబ్జెక్ట్‌ను పక్కకు పెట్టేసి గుంటూరు కారం చేశారు. ఇప్పుడు లేటెస్ట్‌గా బయటికొచ్చిన పోస్టర్ ఆగిపోయిన సినిమాకి సంబంధించిదేనని అంటున్నారు. ఏదేమైనా.. మహేష్ ఆ సినిమా చేసి ఉంటే.. మామూలుగా ఉండేది కాదు.
Wishing the Reigning Superstar, our beloved @urstrulyMahesh garu, a fabulous birthday! ❤️🔥 Your unparalleled charm, grace and versatility continue to set the bar high in cinema🔥💥#HBDSuperStarMahesh 💫🌟 pic.twitter.com/n0Vqw6eg0u
— Haarika & Hassine Creations (@haarikahassine) August 9, 2024