Jogi Ramesh: నకిలి లిక్కర్ కేస్ లో మాజీ మంత్రి జోగి రమేష్ ను ప్రశ్నిస్తున్నారు ఎక్సైస్ పోలీసులు. జోగి రమేష్ వాడుతున్న రెండు మొబైల్స్ తో పాటు ఆయన భార్య ఫోన్ ను సీజ్ చేశారు అధికారులు. జోగి రమేష్ ఇంటి దగ్గర సిసిటీవీ ఫుటేజ్ కు సంబంధించి హార్డ్ డిస్క్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నంలోని జోగి రమేష్ ఇంట్లో రెండు గంటల పాటు తనికీలు చేసింది క్లూస్ టీం. ఆ తర్వాత ఐదు గంటలుగా జోగి రమేష్ ప్రశ్నిస్తున్నారు అధికారులు.
నకిలీ మధ్యం తయారీ కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ ని విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ పోలీసులు అయితే ఉదయం 9 గంటల నుండి కూడా విచారిస్తున్న కేసుకి సంబంధించి ఇప్పటికే 17 మంది మీద కూడా ఈ కేసు నమోదయింది. ఇవాళ జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాము ఇద్దరిని కూడా ఇబ్రహీం పట్నంలో ఉన్న నివాసాల దగ్గర ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్టుగా అధికారులు ప్రకటించారు. ప్రధానంగా అద్దేపల్లి జనార్ధన్ తో ఉన్నటువంటి సంబంధాలు, అటు వ్యాపార సంబంధాలు గాని అదేవిధంగా ఎటువంటి సంబంధాలు ఉన్నాయ అనే అంశం మీద కూడా విచారన చేపడుతున్నారు. దీంతో పాటుగా అద్దేపల్లి జనార్ధన్ కూడా నకిలీ మధ్యం తయారు చేయడానికి సంబంధించి జోగి రమేష్ ఆయన చెప్తేనే చేశానని కూడా చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా అధికారులు సేకరించారు.
Rob Jetten: ప్రపంచంలోనే మొట్టమొదటి గే ప్రధానమంత్రి కానున్న రాబ్ జెట్టెన్ ఎవరు ?
జోగి రమేష్ ఇంటికి అద్యపల్లి జనార్ధన్ వెళ్ళినటువంటి సిసిటీవీ ఫుటేజ్ తో పాటు కొన్ని ఆర్థిక లావాదేవలకి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. జోగి రాముకి అదేవిధంగా అద్యపల్లి జనార్ధనకు మధ్య జరిగినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన ఆధారాలను కూడా జోగి రమేష్ ముందుంచి అధికారులు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఐదు గంటలుగా విచారణ కొనసాగుతోంది. మరోవైపున ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్ళిన ఆ క్లూస్ టీం కూడా అక్కడ పూర్తి స్థాయిలో సిసిటీవీ ఫుటేజ్ కి సంబంధించిన డివిఆర్ ని, అదేవిధంగా జోగి రమేష్ వినియోగిస్తున్నటువంటి రెండు మొబైల్స్ ని, ఇంకా ఆయన సతిమని మొబైల్ మూడు మొబైల్స్.. అలాగే ఇద్దరు పిల్లలు కుమారులు వినియోగిస్తున్నటువంటి రెండు లాప్టాప్స్ ని కూడా సీజ చేసి వాటిని ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించినట్లు సమాచారం. అయితే జోగి రమేష్ మాత్రం ఇది ప్రభుత్వం కుట్ర పూర్వంగా పేర్కొన్నారు.