14 OTT Benefits in Reliance Jio Rs 1198 Plan: దేశీయ ప్రముఖ టెలికాం సంస్థ ‘రిలయన్స్ జియో’ సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అందుకే జియోకి 44 కోట్ల కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్నారు. ఇప్పటికే ఎన్నో ప్లాన్‌లను తీసుకొచ్చిన జియో.. తమ కస్టమర్ల కోసం తాజాగా మరో సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. 84 రోజుల పాటు చెల్లుబాటుతో రూ. 1,198 ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రిలయన్స్ జియో రూ. 1198 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా 84 రోజుల పాటు 168 జీబీ డేటా లభిస్తుంది. అంటే రోజుకు 2జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఐతే రోజువారీ డేటా ముగిసిన తర్వాత 64kbps వేగంతో కూడా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.
Also Read: Operation Valentine: వరుణ్ తేజ్ కోసం రంగంలోకి సల్మాన్ ఖాన్, రామ్ చరణ్!
రిలయన్స్ జియో రూ. 1198 ప్లాన్ ఏకంగా 14 ఓటీటీలకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తోంది. సోనీ లివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ ఎన్‌ఎక్స్‌టీ, కంచ లంక, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, డాక్యుబే, ఎపిక్ ఆన్, హొయ్‌చొయ్ (జియో టీవీ యాప్), ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సబ్‌స్క్రిప్షన్‌లను ఫ్రీగా పొందవచ్చు.