Dhurandhar: ‘‘ధురందర్’’ బాలీవుడ్‌లో వసూళ్ల ఊచకోతను కొనసాగిస్తోంది. సినిమా విడుదలై 5వ వారంలోకి ప్రవేశించినా కూడా వసూళ్లు సాధిస్తూనే ఉంది. బాలీవుడ్ చరిత్రలో ఏ ఖాన్‌కు, కపూర్‌కు సాధ్యం కాని అరుదైన రికార్డును ధురంధర్ సొంతం చేసుకుంది. భారత్‌లో రూ. 831.40 కోట్ల నెట్ వసూళ్లు సాధించి, హిందీ సినిమా ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలిచింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన, రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ సినిమా విడుదలై ఇప్పటికీ 30 రోజులు దాటింది. 5వ వారంలోకి చేరినా, జనవరి 6న రూ. 5.70 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ప్రేక్షకులు రెండు మూడు సార్లు ఈ సినిమా చూస్తుండటం, బలమైన ప్రేక్షక ఆదరణ సినిమా వసూళ్లకు కారణమైంది.
ధురంధర్ వసూళ్లను పరిశీలిస్తే.. తొలి వారంలో రూ. 218 కోట్లు, రెండో వారంలో రూ 261.5 కోట్లు, మూడో వారం రూ. 189.3 కోట్లు, నాలుగో వారం రూ. 115.7 కోట్లను సాధించింది. ఐదోవారం ప్రతీ రోజూ వసూళ్లు రూ. 6 కోట్ల కన్నా తక్కువగా పడిపోయినప్పటికీ, కొత్తగా విడుదలైన సినిమాలకు పోటీని ఇస్తూనే ఉంది. ధూరందర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,222 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్ సినిమాలకు కీలక మార్కెట్‌గా ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాలైన సౌదీ, యూఏఈలో ఈ సినిమాను బ్యాన్ చేసినా కూడా, ఈ రేంజ్ వసూళ్లను సాధించడం ధురందర్‌కు సాధ్యమవ్వడం విశేషం.
Read Also: Curd In Winter: శీతాకాలంలో పెరుగు తినడం హానికరమా?.. అసలు నిజం ఏంటంటే?
మరోవైపు, అమెరికాలో అత్యధిక వసూళ్లను సాధిస్తోంది. యూఎస్, కెనడాల్లో ఘన విజయం సాధించింది. ఈ ప్రాంతంలో 20 మిలియన్ డాలర్లను దాటిన రెండో భారతీయ చిత్రంగా నిలిచింది. RRR, జవాన్, కల్కి 2898 AD వంటి చిత్రాలను అధిగమించింది, ఇప్పుడు యూఎస్‌లో బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డుకు చేరువలో ఉంది.
రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ సినిమా పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌గా సాగుతుంది. ముఖ్యంగా, కరాచీలోని లియారీ గ్యాంగ్, పాక్ ప్రభుత్వం-టెర్రర్ సంబంధాలను వివరిస్తుంది. ఈ నెట్వర్క్‌లోకి ప్రవేశించి ఏజెంట్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ తన యాక్టింగ్‌తో ఇరగదీశాడు. అక్షయ్ ఖన్నా నటన సినిమాకు మరో హైలెట్. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ ఈ సినిమాలో కీలక పాత్రల్ని పోషించారు. ధురంధర్ పార్ట్ 2 మార్చి 19, 2026న విడుదల కాబోతోంది.