JEE Advanced admit card 2023 : దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT)ల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్-2023 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేశారు. జేఈఈ అడ్వాన్స్‌డ్-2023 పరీక్ష జూన్ 4న దేశ వ్యాప్తంగా జరుగనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఐఐటీ గువాహటి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సంబంధించిన అడ్మిట్ కార్డులను తమ అధికార వెబ్‌సైట్ www.jeeadv.ac.in.లో అప్‌లోడ్ చేసినట్టు ప్రకటించింది. పరీక్షకు రిజిస్ర్టేషన్ చేసుకున్న అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. పరీక్ష నిర్వహించే జూన్ 4 వరకు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను జూన్ 4న రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌ను మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. అడ్వాన్స్‌డ్ కోసం దేశవ్యాప్తంగా సుమారు 1.90 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నట్టు సమాచారం. వారిలో 1.46 లక్షల మంది అబ్బాయిలు ఉండగా.. 44 వేల మంది బాలికలు ఉన్నారు.
Read Also: Minister Jogi Ramesh: డర్టీ బాబు, డస్ట్‌బిన్ మేనిఫెస్టో..!