Minister Jogi Ramesh: డర్టీ బాబు, డస్ట్‌బిన్ మేనిఫెస్టో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jogi Ramesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, రాష్ట్ర మంత్రులు ఓ విమర్శలు గుప్పిస్తున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి జోగి రమేష్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. డర్టీ బాబు, డస్ట్‌బిన్ మేనిఫెస్టో అంటూ చంద్రబాబు, టీడీపీ మేనిఫెస్టో పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ 2014 టీడీపీ మేనిఫెస్టోను చూయించారు.. అంతేకాదు.. ఆ మేనిఫెస్టోను చించి డస్ట్ బిన్ లో వేశారు జోగి రమేష్..
Read Also: Chandrayaan 3: చంద్రయాన్ 3పై ఇస్రో చీఫ్ కీలక ప్రకటన.. ప్రయోగం ఎప్పుడంటే..?
Also Read
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
2014 టీడీపీ మేనిఫెస్టోపై, 2019లోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబు సవాల్ చేశారు జోగి రమేష్.. అయినా మీరు చర్చకు రాలేరులే.. అంత దమ్ము లేదు చంద్రబాబుకు, ఆయన తాబేదారులకు అంటూ ఎద్దేవా చేశారు.. 450కి పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశాడని ఆరోపించారు.. కానీ, ప్రభుత్వం 98 శాతం మేనిఫోస్టోలని హామీలను అమలు చేసిందని స్పష్టం చేశారు. ప్రతి గడపలో, ప్రతి ఊర్లో ప్రభుత్వ పథకాలు కనిపిస్తాయి.. ఏ రాష్ట్రంలో అయినా నాలుగేళ్లల్లో ఇన్ని పథకాలు అమలు చేశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక నకిలీ, పిరికిపంద, పనికిమాలిన వాడు.. పార్టీని దొంగతనం చేశాడు.. పొత్తుల్లో పొర్లాడుతుంటాడు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి జోగి రమేష్.
2024 ఎన్నికల్లో చంద్రబాబు అడ్రస్ గల్లంతు అవుతుంది అన్నారు జోగి రమేష్.. రైతు రుణాలు మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఏటా 20 వేలు ఇస్తానంటున్నాడు.. బీసీలకు రక్షణ కవచం అట.. బీసీలను భక్షించిందే నువ్వు కదా? బీసీ వర్గాలను తొక్కి నార తీశాడు అని విమర్శించారు. బీసీల ఆత్మగౌరవం వైఎస్ జగన్..
పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తామంటే అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు.. ఇప్పుడు పేదలను ధనవంతులను చేస్తానని అంటున్నాడు అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి జోగి రమేష్
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!