నటి సదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు జయం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ సినిమా తో మంచి విజయం సాధించింది. ఆ తరువాత వరుసగా స్టార్ హీరోల తో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తరువాత ఈ భామకు అవకాశాలు కాస్త తగ్గుతూ వచ్చాయి. ఈ భామ సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. నిత్యం సరికొత్త లుక్స్ తో కనిపిస్తూ మతులు పోగొడుతోంది. సోషల్ మీడియా లో సదా స్టన్నింగ్ అవుట్ ఫిట్లు ధరిస్తూ తన హాట్ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతుంది..ఈ భామ వరుస పోస్టులతో ఎంతగానో అలరిస్తోంది.
తాజాగా ఈ భామ రెట్రో లుక్ లో కనిపించి బాగా ఆకట్టుకుంది.. స్టన్నింగ్ ఫోజులతో అదరగొట్టింది. చుక్కల అంగీ, తలకి రిబ్బన్, గ్రీన్ లెహంగా ధరించి వింటేజ్ హీరోయిన్ లా మారిపోయింది. కిల్లింగ్ పోజులు ఇస్తూ కుర్రాళ్లను కట్టిపడేసింది.నిజానికి రెట్రో లుక్ లో సదా ఎంతో ముద్దుగా కనిపించింది.. అయితే ఈ భామ ఇలా రెట్రో లుక్ తో కనిపించడానికి ఒక కారణం ఉంది.ప్రస్తుతం ఈ భామ బుల్లితెర పై అలరిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఢీ’ షోతో ఇదివరకు జడ్జీ గా వ్యవహరించి టీవీ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ‘నీతో డాన్స్’ షో తో మరోసారి జడ్జి గా అలరిస్తోంది.ఈ షో కి నటి సదా తో పాటు సీనియర్ హీరోయిన్ రాధ మరియు తరుణ్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహారిస్తున్నారు.ఈ షో ప్రతి శనివారం మరియు ఆదివారం సాయంత్రం 9 గంటలకు స్టార్ మా లో ప్రసారం అవుతోంది. ఈ షో కోసం సదా రెట్రో లుక్ లో కనిపించింది..ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది