January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
January 12 Vidudala: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌ల కాంబోలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘జనవరి 12 విడుదల’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా దూసుకుపోతోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తదుపరి షెడ్యూల్ తాజాగా ఊటీలో మొదలైంది. గత నెలలో మైసూర్లో కీలక సన్నివేశాలతో పాటు ఓ కలర్‌ఫుల్ సాంగ్ చిత్రీకరించిన చిత్ర యూనిట్, ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా ఊటీ కొండల్లో వాలింది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఓ వీడియో ద్వారా పంచుకుంటూ.. “బ్యూటీఫుల్ ఊటీ షెడ్యూల్ నా అద్భుతమైన టీమ్‌తో మొదలైంది” అంటూ 2027 సంక్రాంతి బరిలో దిగుతున్న విషయాన్ని మరోసారి గుర్తుచేశారు.
ఈ సినిమాలో వెంకటేష్ పాత్రే అసలైన హైలైట్‌గా నిలవబోతోందని తెలుస్తుంది. ఇండస్ట్రీలో 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలైన వెంకీ మామా ఫస్ట్ లుక్ ఇప్పటికే సినీ లవర్స్‌ను ఆకట్టుకుంది. ఆర్మీ యూనిఫామ్, కళ్లజోడు, మెడలో స్కార్ఫ్‌తో ‘లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి’గా ఆయన కనిపించిన తీరు సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. సాధారణంగా అనిల్ రావిపూడి మార్క్ కామెడీలో వెంకీ కనిపిస్తేనే థియేటర్లలో నవ్వుల పూలు పూస్తాయి.. అలాంటిది మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌లో వెంకీ సీరియస్ లుక్, దానికి కళ్యాణ్ రామ్ ఎనర్జీ తోడైతే స్క్రీన్ మీద రచ్చ ఏ రేంజ్లో ఉంటుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తుండటంతో సినిమాపై గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్ అంచనాలు భారీగా ఉన్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2027 సంక్రాంతి బరిలో దిగబోతుంది. ఈ మల్టీస్టారర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Also Read
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
The beau𝐎𝐎𝐓𝐘ful schedule begins with my wonderful team ❤️
#January12Vidudala 😍
#Sankranti2027 🔥🔥🔥 https://t.co/IerzlAy6rI— Anil Ravipudi (@AnilRavipudi) October 12, 2026
తాజావార్తలు
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!