Janhvi Kapoor Says My Character is very entertaining in Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవుతుండగా.. తొలి భాగం దేవర: పార్ట్ 1 పేరుతో అక్టోబరు 10న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తన తాజా చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దేవరలో పాత్రను రివీల్ చేశారు.
‘దేవర సినిమాలో నేను తంగం పాత్రలో నటిస్తున్నా. ఇందులో నా పాత్ర చాలా వినోదాత్మకంగా ఉంటుంది. ఇప్పటివరకు చేసిన షూటింగ్ చాలా సరదాగా జరిగింది. సెట్‌లో అందరూ నాపై ఎంతో ప్రేమను చూపారు. చిత్ర యూనిట్ పనితీరు, అంకితభావానికి ఆశ్చర్యపోయాను. దేవర విభిన్నమైన కథ. ఈ సినిమాలో అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు’ అని జాన్వీ కపూర్ తెలిపారు.
Also Read: Sunil Narine: ప్లీజ్ నరైన్.. నువ్ టీ20 ప్రపంచకప్‌లో ఆడు! విండీస్ వీరుడి విజ్ఞప్తి
దేవర చిత్రం యాక్షన్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలో తొలి పాటను విడుదల చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే రెండో పాట విడుదల కానుంది. ఇందులో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.