Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ దేవర ససినిమాతో తెలుగుతెరకు పరిచయం కానుంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది. రెండు పార్ట్ లుగా రిలీజ్ కానున్న ఈ సినిమా.. మొదటి పార్ట్ ఏప్రిల్ 5 న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక తాజాగా జాన్వీ మరో పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో జాన్వీ పదహారణాల పల్లెటూరి పిల్లగా కనిపిస్తోంది.
Sai Pallavi: సాయి పల్లవి, శ్రీలీల.. ఇద్దరు ఒకే సినిమాలోనా.. ఆ ఊహ ఎంత బావుందో
గ్రీన్ కలర్ లంగా, జాకెట్ పై బ్లూ కలర్ ఓణీ వేసుకొని.. నది ఒడ్డున.. రెండు చేతులు నడుముకు ఆనించి నవ్వుతూ కనిపించింది. ఇక ఈ పోస్ట్ కు ” మా బంగారం” అని దేవర టీమ్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అయితే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్.. తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు. మరి జాన్వీ.. తండ్రికి జంటగా చేస్తుందా.. ? కొడుకుకు జంటగా నటిస్తుందా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్- కొరటాల ఎలాంటి హిట్ ను అందుకుంటారో చూడాలి.