Sai Pallavi: సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒక ఫ్రేమ్ లో కనిపిస్తేనే అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తారు. ఇక అదే స్టార్ హీరోలు ఒక సినిమాలో కనిపిస్తే థియేటర్ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే ఇదే ఫార్ములాను కొంచెం మార్చి.. ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే.. వారిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే అదిరిపోతోంది కదా. ప్రస్తుతం దిల్ రాజు.. ఆ పని మీదనే ఉన్నాడని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్స్ ఎవరు .. ? అంటే.. ఫిదా సినిమాతో తెలుగు కుర్రకారును ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి ఒకరైతే.. టాలీవుడ్ మొత్తాన్ని తనవైపు తిప్పుకొని వరుస హిట్లతో షేక్ చేస్తున్న శ్రీలీల ఇంకొకరు.
VarunLav: హల్దీ వేడుక.. హైలైట్ అంటే మెగాస్టారే..
అవును.. వీరిద్దరి కాంబోలో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట దిల్ రాజు. ఇదే కనుక నిజమైతే.. అభిమానులకు కన్నుల పండుగ అని చెప్పొచ్చు. అందుకు కారణం రెండు విషయాలు. ఒకటి.. వీరిద్దరూ డ్యాన్సర్లే. ఒకరిని మించి ఒకరు చేయగలరు. ఒకే ఫ్రేమ్ లో వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే వేరే రేంజ్ అని చెప్పొచ్చు. ఇక రెండవది.. ఇద్దరు స్టార్ హీరోయిన్లు.. ఎవరి ఫ్యాన్ బేస్ వారికి ఉంది. ఇద్దరు కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ కథ కూడా డ్యాన్స్ చుట్టూనే తిరుగుతుందట. అలా అయితే.. ఇద్దరు డ్యాన్సర్ల చుట్టూ తిరిగే కథ అని చెప్పొచ్చు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, సాయి పల్లవి, శ్రీలీల.. ఇద్దరు ఒకే సినిమాలోనా.. ఆ ఊహ ఎంత బావుందో అని కామెంట్స్ పెడుతున్నారు.