ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ టీడీపీతో కలిసి పనిచేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల ప్రకటించారు. అయితే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థిత్వంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో వచ్చే ఎన్నికల ప్రచారంలో 32 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు జనసేన ప్రకటించింది. తెలంగాణలో ఏర్పాటయ్యే పొత్తులపై పార్టీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, అయితే ప్రస్తుతానికి తాము పోటీ చేసే 32 నియోజకవర్గాలపై ఫిక్స్ అయ్యామని జనసేన తెలంగాణ నాయకుడు బొంగునూరు మహేందర్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కూకట్‌పల్లి, ఖమ్మం, ఎల్‌బీ నగర్, కోదాడ తదితర నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థిత్వం ఖరారైంది. గత ఎన్నికల్లో జనసేన 7 పార్లమెంటరీల్లో పోటీ చేసి దాని గురించి మాట్లాడలేకపోయింది.
Also Read : Pawan Kalyan: అంచలంచలుగా అధికారంలోకి రాగలం.. ఒకేసారి గెలవలేం..
జనసేన పార్టీ పోటీ చేసే జాబితాలో మొదటగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లను పొందుపర్చింది. వీటిలో కూకట్‌పల్లి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, సనత్‌నగర్, మల్కాజ్‌గిరి, మేడ్చల్, ఉప్పల్‌లో పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించింది. అలాగే తెలంగాణలోని మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాగర్‌కర్నూల్, ఖమ్మం , వైరా, మునుగోడు, జగిత్యాల , నకిరేకల్, హుజుర్‌నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాలతో పాటుకొత్తగూడెం, అశ్వారావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘనపూర్, హుస్నాబాద్, రామగుండం, ఖానాపూర్, పాలేరు, ఇల్లందు, మధిర నియోజకవర్గాల పేర్లతో కూడిన జాబితా వెల్లడించింది.
Also Read : Minister KTR : కేసీఆర్ చొరవతో నల్లగొండ రూపురేఖలు మారిపోయాయి