Tspsc Chairman: తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రిజైన్ చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసైకి ఆయన సమర్పించారు. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ కలిశారు. కాగా, బోర్టుకు సంబంధించిన వివిధ అంశాలపై ఇరువురు సమగ్రంగా చర్చించారు. అయితే, ఇంతలోనే టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్థన్ రెడ్డి రాజీనామా చేశారు. 2021 మేలో టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌గా ఆయన నియమితులయ్యారు.
Read Also: TS Govt: రూ. 2 లక్షల రుణ మాఫీపై కార్యాచరణ రూపొందించాలి..
అయితే, మరో రెండు రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ నియామకాలకు సంబంధించి సమీక్ష సమావేశం జరగనుంది. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాడినప్పటి నుంచి.. ఇప్పటి దాకా జరిగిన నియామకాల ప్రక్రియకు సంబంధించి పూర్తి ఫైళ్లతో మీటింగ్ కు రావాలని సీఎంవో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ కు ఆదేజాలు జారీ చేసింది. ఇంతలోనే జనార్థన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.