NTV Telugu Site icon

J-K: జమ్మూకశ్మీర్‌ ఎన్నికల వేళ పీఓకేలో ఉగ్రవాదుల మకాం.. దాడికి పెద్ద ఎత్తున ప్లాన్

Pok

Pok

జమ్మూకశ్మీర్‌లో ప్రశాంత వాతావరణంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు దశల్లో పోలింగ్‌ జరగ్గా ఇప్పుడు చివరి దశ ఓటింగ్‌ పెండింగ్‌లో ఉంది. మరోవైపు లోయలో ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉంది. పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ఉగ్రవాదుల సాయంతో లోయ వాతావరణాన్ని విషపూరితం చేసేందుకు ప్రయత్నిస్తోంది. నిజానికి.. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. లష్కరే తోయిబా, జైష్, హిజ్బుల్ ఉగ్రవాదులు పీఓకేలో మకాం వేశారు. ఈ ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేస్తున్నారు.

READ MORE: Israel-Iran: ఇజ్రాయెల్‌తో స్నేహం వద్దు.. ముస్లిం దేశాలకు ఇరాన్ విజ్ఞప్తి

ఓ జాతీయ మీడియాకు ఇంటెలిజెన్స్ అలర్ట్ కాపీ లభించింది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాదుల బృందంతో భారత వ్యతిరేక సమావేశాన్ని నిర్వహించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఖుయిరట్టాలో ఐఎస్‌ఐ ప్రతినిధి ఆగస్టు 29న కొందరు ఉగ్రవాదులతో సమావేశమయ్యారని ఈ హెచ్చరికలో స్పష్టంగా పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లోకి ఎలా ప్రవేశించాలి. ఎక్కడ విధ్వంసం సృష్టించాలి అనే అంశాలపై ఈ సమావేశంలో బ్లూప్రింట్‌ను సిద్ధం చేశారు.

READ MORE:Japan: జపాన్ కొత్త ప్రధానిగా షిగేరు ఇషిబా ఎన్నిక..

హెచ్చరిక ప్రకారం.. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌లకు చెందిన 2 నుంచి 3 మంది ఉగ్రవాదుల బృందం పీఓకేలోని దుధినాల్ సెక్టార్ నుంచి కుప్వారా సెక్టార్‌లోకి ప్రవేశించింది. ఇది మాత్రమే కాదు.. పీఓకేలోని గబ్డోరి గ్రామంలోని లాంచ్ ప్యాడ్ వద్ద జైషే మహ్మద్‌కు చెందిన 5 నుంచి 6 మంది ఉగ్రవాదులు ఉన్నారు. ఈ ఉగ్రవాదులందరికీ ఎకే సిరీస్ ఆయుధాలు, పిస్టల్స్, గ్రెనేడ్‌లు ఉన్నాయి. వారు ఎప్పుడైనా జమ్మూ కాశ్మీర్‌లోకి చొరబడవచ్చు. ఈ టెర్రరిస్టులంతా లోయలో తీవ్రవాద ఘటనలు చేయాలనుకుంటారు.

READ MORE:Japan: జపాన్ కొత్త ప్రధానిగా షిగేరు ఇషిబా ఎన్నిక..

గూఢచార సంస్థల నుంచి వచ్చిన ఈ ముఖ్యమైన ఇన్‌పుట్ పాకిస్థాన్, ఐఎస్ఐ యొక్క కుట్రపూరిత వైఖరిని మరోసారి బహిర్గతం చేసింది. ఇందులో పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుంది. వారిని పెంచి పోషిస్తోది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లో భారత్‌పై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు ఐఎస్‌ఐ సిద్ధమవుతోంది. అయితే .. భారత భద్రతా సంస్థలు కూడా ఫుల్ అలర్ట్ మోడ్‌లో ఉన్నాయి. ప్రతి ఉగ్రవాద కుట్రను భగ్నం చేసేందుకు సరిహద్దుల్లో సైనికులు అప్రమత్తంగా ఉన్నారు.