తెలంగాణలో భూమి సమస్యలు చాలా ఉన్నాయని, వాటి పరిష్కారానికి పంచ సూత్రలను కాంగ్రెస్ పార్టీ సూచిస్తుందన్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 119 నియోజక వర్గాలలో గ్రామాల్లో ధరణి అదాలత్ కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ధరణి వల్ల భూ సమస్యలు చాలా ఏర్పడ్డాయని, రైతులు చాలా గందరగోళంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది పేర్లు ఉంటే దాదాపు 20 లక్షల ఖాతాల్లో సమస్యలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : EX MP Vivek: అవినీతి ఎక్కడుంటే.. సీబీఐ, ఈడీ అక్కడే ఉంటాయి
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో సంపూర్ణ సమగ్ర భూ సర్వే జరుపుతామని, ధరణి పోర్టల్ ఉద్దేశం ఒకరి ఫోటో ఒకరికి పెట్టడం కాదు ..ఎవరి భూములకు వారి హక్కులు కల్పించాలన్నారు. రాష్ట్రంలో భూములకు సంబంధించి 125 చట్టాలు.. 30 వేల జీఓలు ఉన్నాయి.. ఒకే చట్టం తీసుకొస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బలమైన భూ సేకరణ చట్టాన్ని రూపొందించిందని, 2013 లో తెచ్చిన చటం ప్రకారం భూ యజమాని అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితిలో సేకరించవద్దని చట్టం తీసుకొచ్చామన్నారు. బలవంతంగా భూసేకరణ పూర్తిగా నిషేధించడమే కాకుండా చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందని, తెలంగాణ లో 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు..
Also Read : Pak Drone: సరిహద్దు వెంబడి రైఫిల్, బుల్లెట్లను మోసుకెళ్తున్న పాక్ డ్రోన్ కూల్చివేత
వారికి భరోసా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటామన్నారు. వారికి ప్రభుత్వం నుంచి సహాయం లభించడం లేదు. మేము వారిని ఆదుకునే కార్యక్రమం చేపడుతామని, తెలంగాణలో పొత్తులు ఉండవు.. మేము బీఆర్ఎస్ పై గట్టి పోరాటం చేస్తామన్నారు. ఓల్డ్ పెన్షన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, కర్ణాటక బీజేపీ ప్రభుత్వం రాజస్థాన్ మోడల్ కోసం బృందాన్ని పంపుతామని ప్రకటించారన్నారు. కాంగ్రెస్ ఓల్డ్ పెన్షన్ అమలు చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ అభిప్రాయ భేదాలు ఉంటాయని ఆయన అన్నారు.