Jagityal Crime: తోడికోడళ్ల విషాదాంతం.. ఒకరు ఆత్మహత్య.. మరొకరు హత్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూమి వివాదం సంబంధించి జగిత్యాల జిల్లాలో తాజాగా ఓ దారుణ సంఘటన జరిగింది. ఇందులో భాగంగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా పొరుగు ఇంట్లో ఉండే తోడికోడలు కారణమని భావించి ఆమెను హత మార్చారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ లో చోటు చేసుకుంది. ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న గంటల వ్యవధిలోని పక్కింట్లో నివాసం ఉంటున్న మరో మహిళ హత్యకి గురైంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also Read
ధర్మపురం మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన పులి రేణుక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త గంగన్న ఓ గీత కార్మికుడు. ఆయన తన పని ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తన భార్య ఆత్మహత్య చేసుకోవడంతో రగిలిపోయాడు. దాంతో ఇంటి పక్కనే ఉండే పులి పద్మ అనే మహిళ కొద్దిసేపటికి హత్యకు గురైనట్లు అక్కడి స్థానికులు గుర్తించారు. అయితే పద్మ ను ఓ పదునైన ఆయుధం ఉపయోగించి గొంతు కోసి హత మార్చినట్లు గుర్తించారు.
Also read: Ram Charan Birthday: అభిమానులకు క్యూట్ గిప్ట్.. మెగా ప్రిన్సెస్‌ను చూశారా?
ఈ విషయంపై పద్మ గొంతును గంగన్న ఓ పదునైన ఆయుధం తీసుకొని గొంతు కోసి హత్య చేసినట్లు ఆరోపించారు ఆ కుటుంబ సభ్యులు. గత కొద్దిరోజులుగా ఈ రెండు కుటుంబాల మధ్య భూమి విషయంలో తగాదాలు జరుగుతున్నాయి. వీరి ఇరువురి కుటుంబంలో మధ్య సాగుభూమి విషయంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మనస్థాపానికి గురైన రేణుక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది చూసి భరించలేకపోయిన ఆవిడ భర్త గంగన్న తన భార్య చావుకి కారణం పక్కింటి మహిళ పద్మ అని భావించి ఉలిని ఉపయోగించి ఆమె గొంతు కోసి హత మార్చాడు. ఇక ఆత్మహత్య చేసుకున్న రేణుకకు ఇద్దరు కుమారులు ఉండగా.. హత్యకు గురైన పద్మకు కూతురు ఓ కుమారుడు ఉన్నారు. ఇలా గంటల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవడంతో వారి కుటుంబాలలో పెను విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ విషయంపై పోలీసులు సమాచారం అందుకోగా వారు ఇరు కుటుంబాల వారితో మాట్లాడి కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!