మనదేశంలో వంటకా కు సంబంధించి ఎన్నో రకాల ఐటమ్స్ ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచాయి. అందులో ముఖ్యంగా దేశంలో బాగా ఇష్టపడే వాటిలో బటర్ చికెన్, దాల్ మఖానీలు ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. అయితే ప్రస్తుతం దాల్ మఖానీ, బటర్ చికెన్ వంటలకి సంబంధించి వీటిని ఎవరు కనుగొన్నారు అనే అంశంపై మొదలైన న్యాయవివాదం మరింతగా ముదురుతోంది. ఈ విషయం సంబంధించి ఢిల్లీ నగరానికి చెందిన మోతీ మహల్, దర్యాగంజ్ రెస్టారెంట్ల యజమానుల మధ్య పరువు నష్టం వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాన్ని సృష్టిస్తున్నాయి.
Also read: Hyderabad: హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్.. నగరంలో ట్రాఫిక్ మళ్లింపు
తాజాగా ఓ వార్తాపత్రికలో బటర్ చికెన్ ను ఎవరు కనుగొన్నారు అన్న విషయంపై మోతీ మహల్ యజమానులు ఇచ్చిన సమాధానం గాను దర్యాగంజ్ రెస్టారెంట్ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. సదరు ఇంటర్వ్యూలో ఉన్న వ్యాఖ్యలు వివిధ వెబ్సైట్ లలోను దర్శనమిచ్చాయని వాటి వల్ల తమ రెస్టారెంట్ కు గౌరవభంగం కలిగిందని రెస్టారెంట్ వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంపై మోతీ మహల్ యజమానులు ఆ ఇంటర్వ్యూలో వచ్చిన అంశం సంపాదకీయ దృక్పధం అని.. దానిని తమకు ఆపాదించారాలని వారు చెబుతున్నారు. అయితే వీటికి సంబంధించి దాఖలు చేయాలంటూ మోడీ మహల్ రెస్టారెంట్ యజమానులను జస్టిస్ ఆర్దేశించారు. ఇక ఈ విషయంలో తమ పూర్వికుడైన దివంగత కుందన్ లాల్ గుజ్రాల్.. దాల్ మఖానీ, బటర్ చికెన్ వంటకాలను కనుగొన్నారని., అయితే వాటిపై దర్యాగంజ్ తప్పు దోవ పట్టిస్తున్నారని మోతి మహల్ యజమానులు కోర్ట్ ను ఆశ్రయించారు. ఇక అప్పటినుండి ఈ విషయంపై అనేక అంశాలు వివాదంలోకి వచ్చాయి.
Also read: Ram Charan Birthday : మెగాపవర్ స్టార్ టు గ్లోబల్ స్టార్ .. రామ్ చరణ్ సినీ ప్రస్థానం..
ఇక ఈ విషయం సంబంధించి సోషల్ మీడియాలో బట్టర్ చికెన్ మేమే కనిపెట్టాం అనే టాగ్ లైన్ ఉపయోగించకూడదంటూ ఢిల్లీ హైకోర్టు సమాన్లను జారీ చేసింది. అయితే మోతి మహల్ యజమానులు వేసిన దావాపై రిప్లై లేదా లిఖితపూర్వక ప్రకటనను దాఖలు చేయాలని దర్యాగంజి కోరింది.