ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు రెండు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం నెలకొంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని వైఎస్ఆర్సిపి, తెలుగుదేశం, బిజెపి, కాంగ్రెస్, జనసేన పార్టీలు ఇప్పటికే వారి అభ్యర్థులను ప్రకటించి ప్రతి నియోజకవర్గంలో రాజకీయ సభలను ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే తాజాగా నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం పార్లపల్లిలో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు.
Also read: Elections 2024: విజయనగరం జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఎన్నికల అధికారులు..!
ఇక ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తాను సర్వేపల్లి కి నాన్ లోకల్ అని., అయితే మంత్రి కాకాణి తాను లోకల్ అంటూ చెబుతు ప్రచారాం చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఇందులో భాగంగానే తాను నాన్ లోకల్ అయితే పోటీ చేయకూడదా.. అంటూనే సైదాపురంలో జడ్పిటిసిగా కాకాణి పోటీ చేశారని గుర్తు చేశాడు. ఇకపోతే సైదాపురం కాకాణి లోకలా అంటూ ప్రశ్నించాడు. దీంతోపాటునెల్లూరు రూరల్ లో పోటీ చేసే ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోవూరు లో పోటీ చేసే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఉదయగిరిలో పోటీ చేసే మేకపాటి రాజగోపాల్ రెడ్డి అందరూ నాన్ లోకల్ వ్యక్తులే అని ఆయన చెప్పుకొచ్చారు.
Also read: Top Headlines @ 5 PM : టాప్ న్యూస్
ఇక ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. నేను నాన్ లోకల్ అయితే.. నీ సొంత మండలం పొదలకూరులో 25 వేల ఎకరాలకు కండలేరు జలాలు ఇచ్చా.. ఐటిఐ కళాశాలను తెచ్చా.. నిమ్మకాయల యార్డును ఏర్పాటు చేశా అని మంత్రి కాకాణిపై గాతు వ్యాఖ్యలు చేసాడు. అలాగే.ముందు మీ పార్టీలోని నాన్ లోకల్ వారి టికెట్ లు క్యాన్సిల్ చేయించు.. ఆ తర్వాత జడ్పీ ఛైర్మన్ గా.. మంత్రిగా ఏమి అభివృద్ధి చేశావో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు.