ఈ నెల 24 విజయవాడలో ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇస్కాన్ మందిర అధ్యక్షులు చక్రధారి దాస్ వెల్లడించారు. ఈ రథయాత్రకి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే.. ఈ రథయాత్ర 24న మధ్యాహ్నం ఒంటిగంటకు బందర్ రోడ్డులోని డి అడ్రస్ మాల్ నుంచి ప్రారంభమై.. సుమారు 8 కిలోమీటర్ల మేరకు సాగనుందని ఆయన తెలిపారు. మూడు రోజుల పాటు ఈ రథయాత్ర మేళా జరుగుతుందని, దేశం నలుములలో ఉన్న కళాకారులందరూ ఈ రథయాత్రలో పాల్గొని వారి కళలను ప్రదర్శిస్తారని ఆయన వెల్లడించారు. కాలేజీ విద్యార్థులు వెయ్యి మంది వరకు ఈ రథయాత్రలో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.
ఊరేగింపు సమయంలో, వేద గ్రంధాల పంపిణీ, యాత్రలో పాల్గొన్న వారందరికీ ఉచితంగా ‘ప్రసాదం’ అందించబడుతుంది. ఊరేగింపులో ‘కీర్తనలు’, నృత్యం ‘దర్శనం’ మరియు ఉపన్యాసం కూడా ఉన్నాయి. రథయాత్రలో నగర ప్రజలు పాల్గొనేందుకు వీలుగా రథయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Also Read : Salaar: మైసూర్ డాన్ గా ప్రభాస్? KGF 2 లోనే హింట్?