Puri Stampede: ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. గుండిచా ఆలయం దగ్గర జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మరణించగా.. సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారు ప్రేమకాంత మొహంతి, బసంతి సాహూ, ప్రభాతి దాస్ గా అధికారులు గుర్తించారు.
Gautam Adani: హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పూరీ జగన్నాథుడి రథయాత్రలో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కుటుంబం పాల్గొంది. శనివారం పూరీ రథయాత్రలో గౌతమ్ అదానీతో పాటు ఆయన భార్య ప్రతీ అదానీ, కుమారుడు కరణ్ అదానీలు పాల్గొన్నారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల ఊరేగింపుకు సంబంధించిన పూజా ఆచారాలకు వీరు హాజరయ్యారు. ఇదే కాకుండా, ప్రసాదం తయారు చేయడంలో అదానీ కుటుంబం పాలుపంచుకుంది.
Puri Rath Yatra 2025: ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుని రథ యాత్ర మరి కొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రను కన్నులారా చూడటానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు.
ISKCON : రాజమండ్రి నగరం ఆధ్యాత్మికత, భక్తి శ్రద్ధలతో నిండబోతోంది. శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం సందర్భంగా జూన్ 27, 2025 (శుక్రవారం) నాడు ఐఎస్కాన్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో గొప్ప స్థాయిలో రథయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రథయాత్ర ప్రత్యేకత ఏమిటంటే, మధ్యాహ్నం 3 గంటలకు జే.ఎన్. రోడ్ లోని శ్రీ రామాలయం వద్ద నుంచి ప్రారంభమై, దానవాయిపేట, జంపేట, దేవిచౌక్, మేయిన్‌రోడ్ మీదుగా పురవేగంగా సాగుతుంది. ఈ పూజ్య యాత్ర చివరికి ISKCON…
Pakistan: ముస్లిం మెజారిటీ కలిగిన పాకిస్తాన్‌లో ‘‘జగన్నాథ రథయాత్ర’’ ఘనంగా జరిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేలాది మంది హిందువులు ఈ రథయాత్రలో పాల్గొన్నారు. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఈ కార్యక్రమం జరిగింది.
CM Revanth Reddy: ఇస్కాన్ దేవాలయం ఆధ్వర్యంలో జగన్నాధ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు రథయాత్ర కొనసాగనుంది.