జగనన్న విద్యా కానుక కిట్లల్లో భారీ కుంభకోణానికి పాల్పడ్డారంటూ జనసేన కీలక ఆరోపణ చేసింది. నాసిరకం జగనన్న విద్యా కానుక కిట్లను ప్రెస్ మీట్‌లో నాదెండ్ల మనోహర్ ప్రదర్శించారు. ఇవాళ్టి నుంచి రోజుకో స్కీంలో జరిగిన కుంభకోణాన్ని బయట పెడతామని గతంలోనే జనసేన ప్రకటించింది.
ఏపీలోని విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త.. స్కూల్స్ ప్రారంభమైన రోజు నుంచే రాష్ట్రంలో విద్యా కానుక అందించాలని సర్కార్ డిసైడ్.. రేపటి నుంచి అన్ని పాఠశాలలో జగనన్న విద్యా కానుకను అందిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స.. సుమారు 43 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం కింద స్కూల్ డ్రెస్సులు, బూట్లు, రెండు జతల సాక్సులు, బ్యాగ్, బెల్ట్, పుస్తకాలు అందజేత
విద్యార్థులకు మరో శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పటికే వేసవి సెలవులు ప్రారంభం కాగా.. స్కూళ్లు జూన్ 12న తిరిగి తెరుస్తారు.. అయితే, అదే రోజు వారికి విద్యాకానుక అందించాలని ఆదేశాలు జారీ చేశారు..
ఏపీ సీఎం వైఎస్ జగన్.. రేపు (మంగళవారం) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.. ఏపీలో రేపటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో.. కర్నూలు జిల్లా ఆదోనిలో రేపు జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని ప్రారంభించనున్నారు.. వరుసగా మూడో ఏడాది జగనన్న విద్యా కానుక అందిస్తోంది ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి విద్యార్థులకు విద్యా కానుక అందిస్తున్నారు.. ఆయా పాఠశాలల్లోని 47,40,421 మంది విద్యార్ధిని, విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది.. ఇక, కిట్ల…
విద్యాశాఖపై గురువారం మధ్యాహ్నం క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా అమ్మ ఒడికి బదులుగా ల్యాప్ టాప్ ఆప్షన్‌ను 8.21 లక్షల మంది విద్యార్థులు ఎంచుకున్నారని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. నాడు-నేడులో భాగంగా ఇప్పటి వరకు 33వేల అదనపు తరగతులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. సుమారు 23,975 స్కూళ్లలో నాడు-నేడు రెండో దశ కింద పనులు జరుగుతున్నాయని.. నెల రోజుల్లోగా నూటికి నూరు శాతం రెండో దశ కింద చేపట్టనున్న అన్ని…