ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష ఒకటి.. తొలి దశలో ఆరోగ్య సురక్ష విజయవంతంగా నిర్వహించిన ఏపీ ప్రభుత్వం.. 60 లక్షల మందికి పైగా సొంత ఊళ్లలోనే వైద్యం అందించింది.. ఇక, ఇవాళ్టి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభం కాబోతోంది.
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలకు సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలందించేందుకు ఈ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండో దశలో మొదటి గ్రామీణ ప్రాంతాల్లో, 3వ తేదీ నుంచి పట్టణ ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు ప్రారంభం కానున్నాయి.
జగనన్న ఆరోగ్య సురక్ష, 'వై ఏపీ నీడ్స్ జగన్' క్యాంపెయిన్లపై కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. దాదాపు 98శాతం గ్రామ, 77 శాతం వార్డు సచివాలయాల్లో వైద్య శిబిరాల నిర్వహణ పూర్తయ్యిందని ఈ సందర్భంగా సీఎం జగన్ వెల్లడించారు.
జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపైన్ శుక్రవారం(సెప్టెంబర్ 15) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలన్నీ అందించటమే దీని లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్షపై సమీక్ష చేపట్టారు. అనంతరం సీఆర్‌డీఏపై కూడా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.