కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించిన ఆరు గ్యారంటీలు తనని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని జగదీశ్వర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండాపూర్ డివిజన్లోని హాఫీజ్ పేట, ప్రేమ్ నగర్, మార్తాండ్ నగర్ లలో ఆయన ఇంటికి తిరుగుతూ తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.