NTV Telugu Site icon

Jagadish Reddy: దమ్ముంటే రైతులకు ఇచ్చిన హామీలపై చర్చ పెట్టాలి..

Jagadish Reddy

Jagadish Reddy

Jagadish Reddy: తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. శాసన సభను కూడా వాళ్ళ అబద్ధాలను నిజాం చేసుకునేందుకు వాడుకుంటున్నారని ఆరోపించారు. స్పీకర్ కూడా వారికి రూల్స్ తెలియజేసే ప్రయత్నం చేయడం లేదన్నారు. లగచర్ల రైతుల సమస్యపై చర్చించడానికి సమయం అడిగామని.. కానీ స్పందించడం లేదన్నారు. రైతుల సమస్య కంటే టూరిజం ఎక్కువైందా అంటూ జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.

Read Also: MLC Kavitha: సభ జరిగినన్నీ రోజులు గిరిజన రైతుల పక్షాన పోరాడుతాం..

కేవలం ఢిల్లీ, జైపూర్, కొరియా వెళ్లే దానిపై శ్రద్ధ ఉందని.. కేటీఆర్‌పై ఎలా కేసు పెట్టాలనే దానిపై ఆలోచిస్తున్నారన్నారని మండిపడ్డారు. దమ్ముంటే రైతులకు ఇచ్చిన హామీలపై చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. మహిళలకు ప్రకటించిన హామీలపై చర్చ పెట్టాలంటూ డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీలపై చర్చ పెట్టాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే శాసన సభలో చర్చ పెట్టాలని ఛాలెంజ్ విసిరారు. శాసన సభను చూసి కాంగ్రెస్ భయపడుతుందని ఎద్దేవా చేశారు. బిల్లులు ఆమోదం చేసుకోవడానికి మూడు నాలుగు రోజులు అసెంబ్లీ నడిపిద్దాం అనుకుంటున్నారని ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఫైల్‌పై చర్చకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. చర్చకు కేటీఆర్ వస్తాడని.. దమ్ముంటే రేవంత్ రెడ్డి చర్చ పెట్టాలన్నారు. చర్చ పెట్టమంటే సభ వాయిదా వేసి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మా గొంతు నొక్కినా ప్రజా క్షేత్రంలో పోరాటం చేస్తామని ఆయన అన్నారు.