Jagga Reddy : తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విమర్శలు, చురకలతో మార్మోగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చర్చ జరగాలన్న సీఎం రేవంత్ రెడ్డి పిలుపుపై స్పందిస్తూ, బీఆర్ఎస్ నేతలు చర్చకు భయపడుతున్నారని, అసెంబ్లీని తప్పించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. “తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షాన్ని అసెంబ్లీ పెడతావా? చర్చించేది ఉంది అంటూ కోరుతుంటే, ఇక్కడ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ పెడతా, ప్రతిపక్ష…
Minister Seethakka : మంత్రి సీతక్క ప్రజా భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌కు కేటీఆర్ స్పందించిన తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కు కేటీఆర్ కు అర్దం కానట్లు ఉందని, విదేశాలలో ఉన్న కేటీఆర్ తెలంగాణకు వచ్చినట్లు చెప్పేందుకే ప్రెస్ మీట్ పెట్టినట్టుగా ఉందన్నారు. Raj Thackeray: ఠాక్రేలను కలపడానికి, బాలాసాహెబ్ చేయలేనిది…
బనకచర్ల పై అసెంబ్లీలో కేసీఆర్ చర్చకు సిద్ధమా..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రైతు భరోసా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2016లో గోదావరిలోకి 3 వేల టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది మీరు కాదా? అని నిలదీశారు.
KTR: తెలంగాణ బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కేటీఆర్ తనపై వస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీలో చర్చకు సిద్ధమని తమవైపు నుంచి చాలానే ప్రయత్నాలు చేసినప్పటికీ, ప్రతిపక్ష నేతలు ఆ భయంతో పారిపోయారని విమర్శించారు. నాలుగు గోడల మధ్య కాదు, అసెంబ్లీలో చర్చ పెట్టు అంటే పారిపోయారని, లై డిటెక్టర్ పరీక్ష పెట్టమంటే మళ్లీ పారిపోయారు అంటూ ఘాటుగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. Read Also: Kishan Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు నష్టం.. కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్స్..!…
బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ అని మొదటి నుంచి చెబుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. నిన్న అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పొత్తు అర్థం అయ్యిందన్నారు. నేడు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సమావేశంలో మా హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేక.. బీజేపీ ఎమ్మెల్యేల తో స్క్రిప్ట్ రాసి చదివి వినిపిస్తున్నారని ఆరోపించారు.
Harish Rao : ఒక మహిళ మృతి చెందారు, ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండు వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అదే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు సైతం స్వల్ప వ్యవధిలోనే నీటి మూటలు అయ్యాయని, అసెంబ్లీలో ప్రకటించిన…
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. శాసన సభను కూడా వాళ్ళ అబద్ధాలను నిజాం చేసుకునేందుకు వాడుకుంటున్నారని ఆరోపించారు. స్పీకర్ కూడా వారికి రూల్స్ తెలియజేసే ప్రయత్నం చేయడం లేదన్నారు.