NTV Telugu Site icon

Jagadish Reddy : అసెంబ్లీ సస్పెన్షన్ పై సంచలన వ్యాఖ్యలు

Jagadish Reddy

Jagadish Reddy

Jagadish Reddy : తెలంగాణ శాసనసభ సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో BRS ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి సస్పెన్షన్‌పై స్పందించారు. తనపై నిషేధాన్ని అన్యాయంగా అమలు చేశారనే ఆరోపణలు చేస్తూ, అసెంబ్లీ లోపల తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. NTV తో మాట్లాడుతూ జగదీష్‌ రెడ్డి తనపై తప్పుడు నిర్ధారణలతో మోపారని ఆరోపించారు. “నేను స్పీకర్ పై ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదు. ప్రభుత్వం చేసే తప్పులను బయటపెడుతున్నానని నన్ను లక్ష్యంగా చేసుకున్నారు,” అని ఆయన ఆరోపించారు.

జగదీష్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ, “సభ 15 నిమిషాలు వాయిదా పడిన సమయంలో కేసీఆర్ మాకు ఫోన్ చేసి, తప్పుడు ఆరోపణలు ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండమని, స్పీకర్‌ను విచారణకు కోరమని సూచించారు” అని తెలిపారు. తమ వ్యాఖ్యలు నిరూపించడానికి వీడియోలు చూపించడానికి కూడా సిద్ధమని చెప్పారు.

అసెంబ్లీలో తాను అన్యాయంగా సస్పెండ్ అయ్యానని మండిపడిన జగదీష్‌ రెడ్డి, “మూడ్ ఆఫ్ ది హౌస్” పేరిట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు. “ఈ ప్రభుత్వం ఎథిక్స్ లేని ప్రభుత్వం. అలాంటప్పుడు ఎథిక్స్ కమిటీ ఉండటానికి ఎలా అవకాశం ఉంటుంది?” అని ప్రశ్నించారు.

అసెంబ్లీలో తన గళాన్ని నొక్కినా, బయట తన గొంతును అణచలేరని ఘాటుగా స్పందించారు. “నేను తప్పు చేసి ఉంటే నా సభ్యత్వాన్ని రద్దు చేసేవారు. కానీ, నన్ను కావాలని సస్పెండ్ చేశారు. కేసీఆర్ చెప్పినట్లు రేపటి నుంచి నా కార్యాచరణ కొనసాగుతుందని తెలిపారు.

Ola S1 E-Scooters: హోలీ వేళ ఓలా స్కూటర్లపై భారీ డిస్కౌంట్.. రూ.25 వేలకు పైగా