Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Jagadish Reddy Brs Mla Suspension Telangana Assembly

Jagadish Reddy : అసెంబ్లీ సస్పెన్షన్ పై సంచలన వ్యాఖ్యలు

Published Date :March 13, 2025 , 7:01 pm
By Gogikar Sai Krishna
  • నేను ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదు
  • సభ వాయిదా సమయంలో కేసీఆర్ ఫోన్ చేశారు
  • ఎథిక్స్ లేని ప్రభుత్వానికి ఎథిక్స్ కమిటీ ఎలా ఉంటుంది? : జగదీష్‌ రెడ్డి
Jagadish Reddy : అసెంబ్లీ సస్పెన్షన్ పై సంచలన వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jagadish Reddy : తెలంగాణ శాసనసభ సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో BRS ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి సస్పెన్షన్‌పై స్పందించారు. తనపై నిషేధాన్ని అన్యాయంగా అమలు చేశారనే ఆరోపణలు చేస్తూ, అసెంబ్లీ లోపల తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. NTV తో మాట్లాడుతూ జగదీష్‌ రెడ్డి తనపై తప్పుడు నిర్ధారణలతో మోపారని ఆరోపించారు. “నేను స్పీకర్ పై ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదు. ప్రభుత్వం చేసే తప్పులను బయటపెడుతున్నానని నన్ను లక్ష్యంగా చేసుకున్నారు,” అని ఆయన ఆరోపించారు.

జగదీష్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ, “సభ 15 నిమిషాలు వాయిదా పడిన సమయంలో కేసీఆర్ మాకు ఫోన్ చేసి, తప్పుడు ఆరోపణలు ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండమని, స్పీకర్‌ను విచారణకు కోరమని సూచించారు” అని తెలిపారు. తమ వ్యాఖ్యలు నిరూపించడానికి వీడియోలు చూపించడానికి కూడా సిద్ధమని చెప్పారు.

అసెంబ్లీలో తాను అన్యాయంగా సస్పెండ్ అయ్యానని మండిపడిన జగదీష్‌ రెడ్డి, “మూడ్ ఆఫ్ ది హౌస్” పేరిట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు. “ఈ ప్రభుత్వం ఎథిక్స్ లేని ప్రభుత్వం. అలాంటప్పుడు ఎథిక్స్ కమిటీ ఉండటానికి ఎలా అవకాశం ఉంటుంది?” అని ప్రశ్నించారు.

అసెంబ్లీలో తన గళాన్ని నొక్కినా, బయట తన గొంతును అణచలేరని ఘాటుగా స్పందించారు. “నేను తప్పు చేసి ఉంటే నా సభ్యత్వాన్ని రద్దు చేసేవారు. కానీ, నన్ను కావాలని సస్పెండ్ చేశారు. కేసీఆర్ చెప్పినట్లు రేపటి నుంచి నా కార్యాచరణ కొనసాగుతుందని తెలిపారు.

Ola S1 E-Scooters: హోలీ వేళ ఓలా స్కూటర్లపై భారీ డిస్కౌంట్.. రూ.25 వేలకు పైగా

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • brs mla
  • congress
  • Ethics committee
  • jagadish reddy
  • kcr

తాజావార్తలు

  • US-Iran Talks: యూఎస్-ఇరాన్ చర్చలు విఫలమైతే పాకిస్తాన్‌కు దబిడి దిబిడే..

  • Chanakya Niti: కొంగ నుంచి మనిషి నేర్చుకోవాల్సిన ఆ ఒక్క పాఠం ఇదే! చాణక్యుడు చెప్పిన షాకింగ్ నిజం..

  • Venu Udugula: ఇద్దరూ పరిచయమే కానీ.. మంగ్లీ కేసుపై వేణు ఉడుగుల కీలక ప్రకటన!

  • MS Dhoni Return: ఎంఎస్ ధోనీ ఎప్పుడు ఆడుతాడు.. చెన్నై కెప్టెన్ రుతురాజ్ ఆసక్తికర సమాధానం!

  • Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజు అదృష్టం తలుపు తట్టబోయే రాశులు ఇవే! కుబేరుడి అనుగ్రహంతో డబ్బే డబ్బు..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions