‘Dayaa’ web series: జేడీ చక్రవర్తి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు, కథానాయకునిగా, ప్రతినాయకునిగా, సహాయనటునిగా, దర్శకునిగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి జేడీ చక్రవర్తి. వెండితెరమీద ఒక వెలుగు వెలిగిన ఈయన ప్రస్తుతం ఓటీటీ వేదికైన హాట్ స్టార్ లో దయ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఉత్కంఠ ఉద్రేకాలతో సాగె ఈ చిత్రానికి పవన్ సాదినేని దర్శకత్వం వహించగా, శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించారు.. శ్రీకాంత్ మెహతా, మహేంద్ర సోని నిర్మాణం వహించారు.
ఒక సాధారణ ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ గర్భవతిగా ఉన్న తన భార్యకి కష్టం కలగకుండా చూసుకోవాలని కష్టపడుతున్న అతనికి తను నడుపుతున్న వ్యాన్‌లో అతనికే తెలియకుండా ఒక శవం ఉంటే, అది ఒక ప్రముఖ జర్నలిస్ట్ ది అయి ఉంటే అతని పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ అనుకోని సంఘటన అతని జీవితాన్ని ఎలా మార్చింది? అసలు హత్య చేసింది ఎవరు? ఈ సమస్య నుండి డ్రైవర్ ఎలా బయటపడ్డాడు? అనే ప్రశ్నలతో క్షణక్షణం ఉత్కంఠ భరితంగ సాగే ఈ చిత్రం ఆగష్టు 04 వ తేదీన విడుదలైంది.
ఈ చిత్రంలో ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ దయ అలియాస్ దయాకర్‌గా జేడీ చక్రవర్తి కథయకునిగా నటించగా, అతని భార్య అలివేణి పాత్రలో ఈషా రెబ్బా కనిపించారు. జోష్ రవి, విష్ణు ప్రియ, బబ్లూ పృధ్వి రాజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇందులో దయ పాత్ర చాల అద్భుతం గా ఉంది. ప్రతి పాత్రకి ఒక సొంత లక్ష్యం ఉంటుంది. చివరి సీరీస్ చాలా ఆకర్షనీయంగా ఉంది. సీరీస్ లో ప్రతిఒక్కరు నటించారు అనేదానికన్నా వాళ్ళ పాత్రలలో జీవించారు అనడంలో అతిశయోక్తి లేదని.. అయితే అన్ని పాత్రలకన్నా దయ పాత్ర ప్రత్యేకంగా ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.