అయితే ఇస్రో ఈ రోజు ల్యాండర్, రోవర్ తో సంబంధాలను పునరుద్ధరించేందుకు ఇస్రో ప్రయత్నించింది. అయితే ఇంత వరకు గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలు ఎస్టాబ్లిష్ కాలేదని ఇస్రో తెలిపింది. సంబంధాలు ఏర్పరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తామని ప్రకటించింది.
Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో ఒక్కసారిగా ఇస్రో, భారత్ కీర్తి పెరిగాయి. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన అమెరికా, రష్యా, చైనాల తరువాత నాలుగో దేశంగా, చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్‌ని దించిన తొలిదేశంగా భారత్ నిలిచింది.
ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చంద్రయాన్ -3 మిషన్, ప్రజ్ఞాన్ రోవర్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని పంచుకున్నారు. అంతా బాగానే ఉందని, అన్ని రకాల డేటా చాలా బాగా వస్తోందని చెప్పారు.
చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా ప్రజ్ఞాన్ రోవర్ చంద్రునిపై సంచరిస్తున్న సంగతి తెలిసిందే. అయిన ఆ రోవర్‌కు ఊహించని అడ్డంకి ఎదురైంది. రోవర్‌కు భారీ బిలం అడ్డుగా వచ్చినట్లు ఇస్రో తెలిపింది.
అంతరిక్ష పరిశోధన చరిత్రలో మొట్టమొదటిసారిగా చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై నేల ఉష్ణోగ్రతను వివరించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన విక్రమ్ ల్యాండర్‌లోని ChaSTE(చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్) పేలోడ్ సహాయంతో చంద్రయాన్-3 చేసిన పరిశోధనలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 మిషన్ లక్ష్యాలలో మూడింటిలో రెండింటిని సాధించామని ఇస్రో తెలిపింది.
చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ అయిన శివశక్తి పాయింట్ చుట్టూ ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతున్నట్లు చూపించే వీడియోను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శనివారం విడుదల చేసింది. "ప్రజ్ఞాన్ రోవర్ దక్షిణ ధృవం వద్ద చంద్ర రహస్యాలను వెతకడానికి శివశక్తి పాయింట్ చుట్టూ తిరుగుతోంది." అని ట్విటర్ వేదికగా చెప్పింది.
మరోవైపు చంద్రయాన్-3 ఉపగ్రహం జాబిల్లికి మరింత చేరువైంది. తాజాగా ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ విడిపోయిన విషయం తెలిసిందే. ల్యాండర్ ఇమేజర్ (LI) కెమెరా-1 ద్వారా తీసిన అద్భుతమైన చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో X లో షేర్ చేసింది. అయితే గురువారం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోగానే ల్యాండర్ ఈ ఫోటోలను తీసినట్లు ఇస్రో వెల్లడించింది.