Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Isro Chairman Met With Cm Revanth Reddy

ISRO: తెలంగాణ సర్కార్ తో ఇస్రో కీలక ఒప్పందం..

Published Date :February 8, 2024 , 9:31 am
By Chandra Shekhar Pamena
ISRO: తెలంగాణ సర్కార్ తో ఇస్రో కీలక ఒప్పందం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్ లో కొత్తగా డ్రోన్​ పోర్ట్​ ఏర్పాటు కాబోతుంది. ఈ మేరకు డ్రోన్​ పైలెట్లకు అధునాతన శిక్షణకు సంబంధించి ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ మధ్య ఒప్పందం కుదిరింది. నిన్న (బుధవారం) సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఇస్రో చైర్మన్ సోమనాథ్ సమావేశం అయ్యారు. వీరి సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్ఎన్ రెడ్డి, ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహన్ ఎంఓయూలపై సంతకం చేశారు.

Read Also: Foxconn : భారత్‎లో రూ.1200కోట్ల పెట్టుబడులు పెట్టనున్న తైవాన్ కంపెనీ

అయితే, హైదరాబాద్ పరిసరాల్లో ప్రత్యేకంగా డ్రోన్ పైలెట్ల శిక్షణకు స్థలం కేటాయించాలని ఏవియేషన్ అకాడమీ అధికారులు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. దీంతో డ్రోన్ పోర్టు ఏర్పాటుకు ఎంత స్థలం అవసరం, ఏఏ నిర్మాణాలు చేపడుతారని సీఎం ఆరా తీశారు. పైలెట్ల శిక్షణతో పాటు డ్రోన్ల తయారీ కంపెనీలు తమ ట్రయల్స్ నిర్వహించుకునేందుకు డ్రోన్ పోర్టు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. డ్రోన్ పోర్టుకు అవసరమైన 20 ఎకరాల స్థలాన్ని ఫార్మా సిటీ వైపు అన్వేషించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఏవియేషన్ నిబంధనల ప్రకారం అభ్యంతరం లేని జోన్​లో ఈ స్థలం కేటాయించాలన్నారు.

Read Also: Nikki Haley: భారత్‌ చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తోంది.. నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇక, ఈ ఒప్పందంలో భాగంగా డ్రోన్ పైలెటింగ్, డ్రోన్ డేటా మేనేజ్​మెంట్, డేటా అనాలసిస్ పై ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఎన్ఆర్ఎస్సీ సైంటిస్టులకు, అకాడమీలో శిక్షణ పొందుతున్న డ్రోన్ పైలెట్లకు డేటా అనాలసిస్, డేటా ప్రాసెసింగ్, మ్యాపింగ్ పై 15 రోజుల శిక్షణ కోర్సులు నిర్వహించనున్నారు. అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగిపోవడంతో పొలాల్లో ఎరువులు, పురుగు మందులను చల్లేందుకు రైతులు డ్రోన్లను వినియోగిస్తున్నారు.. కొన్ని చోట్ల స్వయం సహాయక సంఘాలు డ్రోన్లను ఉపాధి మార్గంగా ఎంచుకున్నాయన్నారు. ఉన్నత స్థాయి నుంచి తహసీల్దార్ల స్థాయి వరకు ప్రభుత్వ అధికారులకు కూడా డ్రోన్లపై అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Read Also: Balakrishna: బాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థల ఫోకస్..

అలాగే, దేశంలోనే వినూత్నంగా తెలంగాణ ఈ శిక్షణ కోర్సు నిర్వహిస్తోందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. శాటిలైట్, రిమోట్ సెన్సింగ్, అంతరిక్ష వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్ఆర్ఎస్సీ డ్రోన్ టెక్నాలజీని మరింత సాంకేతికంగా వినియోగించుకునేందుకు ఈ శిక్షణలో భాగస్వామ్యం అవుతుందన్నారు. దేశంలో12 సార్లు బెస్ట్ ఏవియేషన్ అవార్డును అందుకున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సేవలను ఇస్రో ఛైర్మన్ ప్రశంసించారు. ప్రస్తుతం ఎయిర్ పోర్టులోనే డ్రోన్ పైలెట్లకు శిక్షణనిస్తున్నాం.. అక్కడున్న రద్దీ దృష్ట్యా వరంగల్ ఎయిర్ పోర్ట్ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM Revanth Reddy
  • ISRO
  • isro chairman
  • somanath
  • telangana

తాజావార్తలు

  • AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే..

  • Donald Trump: “యుద్ధం మళ్లీ మొదలవుతుంది”.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..

  • Sangeeth Sobhan: నిహారిక లేకపోతే.. సంగీత్ శోభన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • US-Iran Talks: చర్చలకు ముందు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఇరాన్..

  • Niharika Konidela: డిస్ట్రిబ్యూటర్ల ఆనందమే అసలైన విజయం.. ప్రతీ ఒక్కరికీ థాంక్స్!

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions