ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ISRO ) జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా.. ఆగస్టు 23న 30 ఏళ్లకు పైగా రిమోట్ సెన్సింగ్ డేటాను సాధారణ ప్రజలకు విడుదల చేయాలని యోచిస్తోంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTI), ISpA ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ S. సోమనాథ్ మాట్లాడుతూ.. మా దగ్గర 30 సంవత్సరాలకు పైగా నిల్వ ఉన్న డేటా అందుబాటులో ఉంది. ఈ డేటాను ప్రజలకు అందుబాటులో…
GSLV-F14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహననౌక ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. అనంతరం 2,275 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశ పెట్టింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం 5.35 గంటలకు ప్రయోగించారు.
హైదరాబాద్ లో కొత్తగా డ్రోన్ పోర్ట్ ఏర్పాటు కాబోతుంది. ఈ మేరకు డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణకు సంబంధించి ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ మధ్య ఒప్పందం కుదిరింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నూతన ఛైర్మన్‌గా ఎస్.సోమనాథ్ నియామకం అయ్యారు. 2018 నుంచి విక్రం సారాభాయి అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌గా సోమనాథ్ విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 14తో ప్రస్తుత ఇస్రో ఛైర్మన్ కె.శివన్ పదవీ కాలం ముగియనుంది. అనంతరం సోమనాథ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కేరళకు చెందిన సోమనాథ్ దేశంలో టాప్ రాకెట్ సైంటిస్టుల్లో ఒకరిగా ఉన్నారు. ఉపగ్రహ వాహక నౌకల డిజైనింగ్‌లో సోమనాథ్ కీలక పాత్ర పోషించారు. కెరీర్ తొలినాళ్లలో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్…