Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
- ఫ్లైదుబాయ్ ఘటనపై దర్యాప్తు
- భారత కెప్టెన్ స్మిత్ మచార్‌పై ఒమన్ కో-పైలట్ దాడి
- విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడని ఇజ్రాయెల్ ఆరోపణ
- నిందితుడిని ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flydubai Attack: దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం FZ1073ను కూల్చేందుకు కో-పైలట్ ప్రయత్నించడం సంచలనంగా మారింది. దాదాపుగా 180 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో భారత పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసి, విమానాన్ని కూల్చే ప్రయత్నం చేశాడు. దాడికి పాల్పడిన పైలట్‌ను ఒమన్ జాతీయుడిగా ఇజ్రాయిల్ చెబుతోంది. స్మిత్‌తో పాటు ప్రయాణికుల పోరాటంతో విమానం సురక్షితంగా సౌదీ అరేబియాలో ల్యాండైంది.
యూఏఈతో కలిసి ఫ్లైట్ ఘటనను ఇజ్రాయిల్ దర్యాప్తు చేస్తోంది. ఇదిలా ఉంటే, ఘటనకు పాల్పడిన కో-పైలట్‌ను ఇజ్రాయిల్ తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తుంది. కానీ ఇది సాధ్యమయ్యేలా కనిపించిడం లేదు. ప్రస్తుతం నిందితుడు సౌదీ అరేబియాలో ఉండటంతో సమస్య దౌత్యపరంగా చిక్కుల్ని ఎదుర్కొంటోంది. ఇజ్రాయిల్, సౌదీ అరేబియాతో దౌత్య సంబంధాలు లేవు. పైలట్ ఒమన్ జాతీయుడు. ఇజ్రాయిల్‌కు ఒమన్‌తో కూడా దౌత్య సంబంధాలు లేవు. ఇక యూఏఈతో దౌత్య సంబంధాలు ఉన్నప్పటికీ, రెండు దేశాల మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం లేదు. దీంతో ఇజ్రాయిల్‌కు పైలట్‌ను అప్పగించడం దాదాపు అసాధ్యమే అని తెలుస్తోంది.
Also Read
ప్రస్తుతం సౌదీ అరేబియా అతడిని ప్రాథమికంగా విచారిస్తోంది. దీని తర్వాత నిందితుడైన కోపైలట్‌ను యూఏఈకి అప్పగించే అవకాశం ఉంది. విమానం యూఏఈకి చెందింది కావడంతో, ఘటనకు సంబంధించిన దర్యాప్తులో యూఏఈ అధికారులు పాల్గొంటున్నారు. తదుపరి దశలో యూఏఈకి నిందితుడిని అప్పగిస్తారు. అయితే, ఇప్పుడు అతడిని ఇజ్రాయిల్‌కు అప్పగిస్తారా? లేదా? అనేది అస్పష్టంగా ఉంది.
మరోవైపు తమకు అప్పగించాలని ఇజ్రాయిల్ డిమాండ్ చేస్తోంది. ‘‘విమానాన్ని కూల్చి 180 మంది ఇజ్రాయిలీలనున చంపేందుకు యత్నించిన వ్యక్తిని ఇజ్రాయిల్‌కు అప్పగించి, ఇక్కడే అత్యంత కఠినమైన శిక్ష విధించాలి’’ అని ఇజ్రాయిల్ భద్రతా మంత్రి బెన్ గ్విర్ కోరారు. ఇందుకోసం న్యాయ మంత్రిత్వ శాఖ, సంబంధిత దౌత్య అధికారులను సంప్రదించి అందుబాటులో ఉన్న మార్గాలను వినియోగించాలని భద్రతా కేబినెట్లో కోరనున్నట్లు ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?