Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sundeep Kishan: సినిమా రిలీజ్‌కి ముందే పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారంపై యంగ్ హీరో సందీప్ కిషన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన రాబోయే చిత్రంపై సోషల్ మీడియాలో సాగుతున్న పెయిడ్ నెగెటివిటీని ఆయన తీవ్రంగా ఖండించారు. తెరవెనుక ఉండి ఇలాంటి కుట్రలు నడిపిస్తున్న వారికి గట్టి వార్నింగ్ ఇస్తూ, ఈ వ్యవహారాన్ని ఇలాగే కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించారు. ‘ఎక్స్’ వేదికగా సందీప్ కిషన్ పెట్టిన పోస్ట్ సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. “గత కొన్ని రోజులుగా నన్ను, నా కొత్త చిత్రాన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీని వెనుక అసలు ఎవరున్నారో, తెరవెనుక ఎవరు నడిపిస్తున్నారో నాకు స్పష్టంగా తెలుసు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మీకో విషయం ముందే గుర్తు చేస్తున్నా.. ఈ వ్యవహారంలో నాకంటే మీరే ఎక్కువ నష్టపోతారు. ఒకసారి వ్యవహారం డైరెక్ట్ అయిపోతే అందరూ అడ్డంగా దొరికిపోతారు.. చూసుకోండి” అంటూ ఘాటు పదజాలంతో హెచ్చరికలు జారీ చేశారు. హీరో నేరుగా రంగంలోకి దిగి ఇలా వార్నింగ్ ఇవ్వడం వెనుక పెద్ద నెట్వర్కే ఉందన్న చర్చ మొదలైంది.
తమిళనాడు సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్ డైరెక్టర్‌గా పరిచయమవుతూ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సిగ్మా’. ఇందులో సందీప్ కిషన్ ప్రధాన పాత్ర పోషించగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది. రాజు సుందరం, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాహసాలతో కూడిన నిధి అన్వేషణ (ట్రెజర్ హంట్) స్టోరీ లైన్‌తో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రంపై ఫస్ట్ నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో అక్టోబరు 2న గ్రాండ్‌గా థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థలైన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ఎన్.వి.ఆర్ సినిమా విడుదల చేస్తున్నాయి. సరిగ్గా రిలీజ్ ముంగిట కావాలనే కొందరు వ్యక్తులు డిజిటల్ మాధ్యమాల్లో విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన సందీప్ కిషన్.. కంటెంట్‌ను నమ్ముకుని వస్తున్న తమను ఇలాంటి కుట్రలతో ఆపలేరని తేల్చిచెప్పారు.
Also Read
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
I see a lot of targeted anti Tweets coming at me & my film over the last few days lol
I know exactly the people behind this & paying for this as well…
Just reminding you that you have more to lose than me..
Direct ayipithe andaru dorikipitharu mari.. choosukondi :)— Sundeep Kishan (@sundeepkishan) October 1, 2026
తాజావార్తలు
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?