Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
- ఫ్లైదుబాయ్ FZ1073 కాక్‌పిట్ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తు
- భారత కెప్టెన్ స్మిత్ మచార్‌పై కో-పైలట్ దాడి
- కో-పైలట్ తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలంతో ప్రభావితమయ్యాడన్న నెతన్యాహు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flydubai Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనలో భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి, విమానాన్ని కూల్చే ప్రయత్నంపై ఇజ్రాయిల్ దర్యాప్తు చేస్తోంది. యూఏఈతో కలిసి దర్యాప్తులో పాలుపంచుకుంటోంది. ఈ దాడి ఘటనలో కో-పైలట్ తీవ్ర ఇస్లామిక్ భావజాలానికి ప్రభావితమై ఉన్నాడని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆరోపించారు. ఈ ఘటన వెనక అతడికి ఎవరైనా సహకరించారా? ఇరాన్‌తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భారత పైలట్ స్మిత్‌పై దాడి చేసిన కో-పైలట్ ఒమన్ జాతీయుడని ఇజ్రాయిల్ చెబుతోంది.
ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహూ మాట్లాడుతూ.. భారత పైలట్‌పై దాడి చేసిన కో-పైలట్ “ఇస్లామిస్ట్ ఇండోక్ట్రినేషన్”కు గురయ్యాడని చెప్పారు. తీవ్రమైన ఇస్లామిక్ భావజాలాన్ని పదే పదే బోధించి, దానితో ప్రభావితం చేశారని అన్నారు. పైలట్ స్మిత్ మచ్చర్ కో-పైలట్ దాడికి గురైనప్పటికీ, రక్తమోడుతున్నప్పటకీ కాక్‌పిట్ తలుపులు తెరిచారు. దీంతో ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి చేరి, కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సౌదీ అరేబియాలోని ఒక చిన్న ఎయిర్ పోర్టులో సుక్షితంగా విమానం ల్యాండైంది. ఈ ప్రమాదం నుంచి 180 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. గాయాలపాలైన స్మిత్ ప్రస్తుతం యూఏఈలో చికిత్స పొందుతున్నారు.
Also Read
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
తాజావార్తలు
-
Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
-
Telangana Cabinet: తెలంగాణలో కరువు టెన్షన్.. 235 మండలాల్లో వర్షభావం..
-
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?