Falcon Case: ఫాల్కన్ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడి (ED). ఇందులో భాగంగా 791 కోట్లు మోసం చేసినట్లు నిర్ధారించింది. యాప్ బేస్డ్ పెట్టుబడుల పేరుతో భారీ వసూళ్లకు పాల్పడిన అమర్ దీప్ ఆ డబ్బుతో సొంత ఆస్తులు, చార్టర్డ్ ఫ్లైట్లు కొనుగోలు చేశాడు. ఫాల్కన్ కేస్ వెలుగులోకి రావడంతో చార్టర్డ్ ఫ్లైట్లో విదేశాలకు పారిపోయాడు. విదేశాల్లో ఉన్న అమర్ దీప్ ను రప్పించేందుకు ఈడి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే చార్టర్డ్ ఫ్లైట్ తో…
Nehal Modi: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారీ నీరవ్ మోడీ సోదరుడు నేహాల్ మోడీని అమెరికాలో అధికారులు అరెస్ట్ చేశారు. భారత అప్పగింత అభ్యర్థన మేరకు అమెరికా అధికారులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. నేహాల్ మోడీని కోట్లాది రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణానికి సంబంధించి అమెరికాలో అరెస్టు చేశారు, ఇది భారతదేశానికి పెద్ద దౌత్య విజయం. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం, బెల్జియన్ జాతీయుడైన నేహాల్ మోడీని జూలై 4న అదుపులోకి తీసుకున్నారు.
Tahawwur Rana: అమెరికా సుప్రీం కోర్టు శనివారం 2008లో జరిగిన ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు తహవ్వూర్ రాణాను భారత్‌కు పంపించేందుకు ఆమోదం తెలిపింది. 2008 ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన తహవ్వూర్ రానా, పాకిస్తాన్ మూలానికి చెందిన కెనడియన్ పౌరుడిగా గుర్తించబడ్డాడు. రానా అప్పగింతను అమెరికా సుప్రీంకోర్టు ఆమోదించింది. జనవరి 21న, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన ఒక రోజు తర్వాత, అమెరికా సుప్రీంకోర్టు అతని అప్పీల్‌ను తిరస్కరించింది. ‘పిటీషన్‌ను కొట్టివేస్తున్నాం’ అని కోర్టు…
షేక్ హసీనా వల్ల భారత్‌కు ముప్పు ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా విషయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ మాట్లాడుతూ, హసీనా భారత్‌లోనే కొనసాగితే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.