Vijay-Rashmika: ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎంగేజ్మెంట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Deverakonda, Rashmika Mandanna to get engaged in February: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, కన్నడ సోయగం రష్మిక మందన్న డేటింగ్లో ఉన్నట్లు ఎప్పటినుంచో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పార్టీలు, విహారయాత్ర, పండగలను ఇద్దరు కలిసి చేసుకోవడం.. వీరిద్దరూ కలిసి ఒకే లోకేషన్లో దిగిన ఫోటోలను వేర్వేరుగా పోస్ట్ చేయడంతో ఈ డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే విజయ్, రష్మికలు ఇప్పటివరకు తమ డేటింగ్ గురించి ఎక్కడా స్పందించలేదు. అయితే తాజాగా వీరిద్దరికి సంబధించిన మరో వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారట. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఫిబ్రవరి రెండవ వారంలో విజయ్, రష్మికలు ఎంగేజ్మెంట్ చేసుకోనున్నారట. ఎంగేజ్మెంట్కు సంబంధించిన వార్తను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు తెల్సుస్తోంది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు మొదలనట్లు సమాచారం. విజయ్, రష్మిక జంటగా ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ అనే చిత్రాల్లో నటించారు. గీత గోవిందం చిత్రీకరణ సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారట.
Also Read
Also Read: Golden Globe Awards 2024: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్.. ఓపెన్హైమర్కు ఐదు అవార్డులు!
‘కిరిక్ పార్టి’ అనే కన్నడ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన రష్మిక మందన్న.. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమానే హిట్ కావడంతో తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ఛలో, గీతాగోవిందం, దేవ్ దాస్, సరిలేరు నీకెవ్వరూ, పుష్ప, సీతారామం లాంటి భారీ హిట్లు రష్మిక ఖాతాలో ఉన్నాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన రష్మిక.. ‘యానిమల్’తో బాలీవుడ్లో భారీ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ షూటింగ్లో ఉన్నారు. ‘రెయిన్బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘చావా’ సినిమాలు చేయాల్సి ఉంది. మరోవైపు విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’లో నటిస్తున్నాడు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?