Golden Globe Awards 2024: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్.. ఓపెన్‌హైమర్‌కు ఐదు అవార్డులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cillian Murphy and Lily Gladstone Wins Golden Globes 2024 Awards: ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డ్స్ 2024లో హాలీవుడ్ చిత్రం ‘ఓపెన్‌హైమర్’ సత్తా చాటింది. ఏకంగా ఐదు విభాగాలలో అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ నటుడు (సిలియన్ మర్ఫీ), ఉత్తమ దర్శకుడు (క్రిస్టఫర్ నోలన్), ఉత్తమ సహాయ నటుడు (రాబర్ట్ డౌనీ జూనియర్), ఉత్తమ ఒరిజినల్ స్కోర్ (లుడ్విగ్ గోరాన్సన్) మరియు ఉత్తమ చిత్రం కేటగిరిల్లో ఓపెన్‌హైమర్‌కు అవార్డులు వచ్చాయి. క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. తేడాది విడుదలైన ఓపెన్‌హైమర్ సంచలనం సృష్టించింది.
ఉత్తమ నటి అవార్డు ‘కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్’ సినిమాలో నటనకు గాను లిల్లీ గ్లాడ్‌స్టోన్ గెలుచుకున్నారు. ఉత్తమ హాస్య నటిగా ఎమ్మా స్టోన్, ఉత్తమ హాస్య నటుడుగా పాల్ గియామట్టి ఎంపికయ్యారు. ‘బార్బీ’ సినిమా కూడా పలు కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డులను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం రాత్రి కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో హాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
గోల్డెన్ గ్లోబ్ విజేతలు (Golden Globe Awards 2024 Winners List):
ఉత్తమ చిత్రం-ఓపెన్‌హైమర్
ఉత్తమ కామెడీ చిత్రం-పూర్ థింగ్స్
ఉత్తమ ఆంగ్లేతర చిత్రం-అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
ఉత్తమ యానిమేటెడ్ చిత్రం-ది బాయ్ అండ్ ది హెరాన్
బాక్సాఫీస్ అచీవ్‌మెంట్ అవార్డు-వార్నర్ బ్రదర్స్ (బార్బీ)
ఉత్తమ దర్శకుడు-క్రిస్టఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే-జస్టిన్ సాగ్ ట్రైట్, ఆర్ధర్ హరారి (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్)
ఉత్తమ నటుడు-సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ నటి-లిల్లీ గ్లాడ్‌స్టోన్ (కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్)
ఉత్తమ హాస్య నటి-ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
ఉత్తమ హాస్య నటుడు-పాల్ గియామట్టి (ది హోల్డోవర్స్)
ఉత్తమ సహాయనటి-డావిన్ జాయ్ రాండోల్ఫ్ (ది హోల్డోవర్స్)
ఉత్తమ సహాయనటుడు-రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్-వాట్ వాస్ ఐ మేడ్ (బార్బీ)
ఉత్తమ ఒరిజినల్ స్కోర్-లుడ్విగ్ గోరాన్సన్ (ఓపెన్‌హైమర్)
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..