ఈసారి బాక్సాఫీస్ దగ్గర బాలయ్య బాబు చేసే తాండవం చూడ్డానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 చేస్తున్నాడు బాలయ్య. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను.. ఇదే ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 25న అఖండ తాండవం జరగబోతోందని తెలిపారు. కానీ ఇప్పుడు అనుకున్న సమయానికి అఖండ 2 రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
మేకర్స్ పక్కాగా రిలీజ్ అవుతుందని చెబుతున్నప్పటికీ.. దసరా నుంచి అఖండ సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దీంతో అఖండ ప్లేస్‌లో ఓజీ రిలీజ్‌కు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీపై భారీ అంచనాలున్నాయి. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్.. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది. ఇక్కడితో ఓజి షూటింగ్ అయిపోయినట్టే. దీంతో వీలైనంత త్వరగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Also Read: SSMB 30: మహేష్ బాబుతో సినిమా.. రేసులో ఇద్దరు పాన్ ఇండియా డైరెక్టర్స్?
అఖండ 2 పోస్ట్ పోన్ అయితే సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ అఖండ 2 రేసులో ఉన్నా కూడా.. ఓజీని రంగంలోకి దింపే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. కానీ బాలయ్య వర్సెస్ పవన్ బాక్సాఫీస్ వార్ జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. కాబట్టి ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి దసరా బరిలో ఉండడం మాత్రం గ్యారెంటీ. ప్రస్తుతానికి ఓజి రిలీజ్ డేట్, అఖండ 2 వాయిదా రూమర్స్ మాత్రమే. త్వరలోనే ఈ విషయంలో ఓ క్లారిటీ రానుంది. ఏదేమైనా ఓజీ, అఖండ 2 పై మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి.