New Tatkal Timings: భారత్ లో రైలు ప్రయాణానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే రవాణా. రైలు ప్రయాణం ఎంతో చవకగా, అందరికీ అందుబాటులో ఉండే ప్రయాణ మార్గం. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లే సామాన్యులు ఎక్కువగా రైళ్లను ఆశ్రయిస్తారు. అలాగే సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉండడంతో చాలామంది రైలు ప్రయాణానికి ఇష్టపడతారు. భారత్ లో వేల కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగల శక్తి రైళ్లదే. ఫ్లైట్స్, బస్సులతో పోలిస్తే రైలు టికెట్లు తక్కువ ధరకే లభ్యం కావడం వల్ల, ఇది మధ్యతరగతి అలాగే తక్కువ ఆదాయ వర్గాల ప్రజలకు ముఖ్యమైన ఎంపికగా నిలుస్తుంది.
Also Read: Char Dham Yatra 2025: ఏప్రిల్ 30 నుంచి చార్ ధామ్ యాత్ర షురూ..
అయితే, ప్రస్తుత రోజుల్లో రైలు ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రస్తుత కాలంలో ఎక్కడికైనా సుదూర ప్రాంతానికి ప్రయాణం చేయాలంటే అందుకు తగ్గట్టుగా మూడు నెలల ముందే ప్రయాణం సంబంధించిన టికెట్లను బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందుకోసం భారతీయ రైల్వే ఐఆర్సిటిసి ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకునే సదుపాయం కలిగిస్తుంది. రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా తాత్కాల్ టికెట్లు కూడా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలంటే రేపు ప్రయాణం చేయాలి అనుకుంటే ముందు రోజు అందుకు సంబంధించిన టికెట్లను కాస్త డబ్బులు ఎక్కువగా వెచ్చించి బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి. అయితే, ఇలా బుక్ చేసుకోవడానికి కూడా ప్రత్యేక సమయాన్ని కేటాయించింది భారతీయ రైల్వే. ఇకపోతే, ఏప్రిల్ 15 నుంచి ఈ బుకింగ్ సమయాలను మార్పులు చేస్తున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది.
ఈ కొత్త రూల్స్ ప్రకారం ఏసీ క్లాస్ టికెట్ తత్కాల్ బుకింగ్ సమయం ఇదివరకు 10 గంటలకు మొదలవుతుండగా.. ప్రస్తుతం ఆ సమయాన్ని 11 గంటలకు మార్చారు. అలాగే నాన్ ఎసి స్లీపర్, 2S టికెట్ల కోసం ఇదివరకు బుకింగ్స్ సమయం 11 గంటలకు ఉండగా, దానిని కొత్త రూల్స్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు మార్చారు. ప్రీమియం తత్కాల్ సమయం ఇదివరకు 10 గంటలకు ఉండగా, దానిని 10:30 గంటలకు మార్చారు. కాబట్టి ఏప్రిల్ 15 నుంచి ఈ విషయాలను గుర్తు పెట్టుకొని సరైన సమయంలో టికెట్ బుక్ చేసుకుని ప్రయాణించవచ్చు.