రైలు టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ ఐఆర్‌సీటీసీ (IRCTC) గురువారం ఉదయం చాలా సేపు నిలిచిపోయింది. దీని కారణంగా.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు టికెట్ బుక్ చేసుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. వెబ్‌సైట్ ఓపెన్ కాలేదు. నిర్వహణ కార్యకలాపాల కారణంగా ఇ-టికెట్ సేవ అందుబాటులో ఉండదని సందేశం చూపించింది. దయచేసి కొంత సమయం తర్వాత ప్రయత్నించండి. అని సమాధానం వచ్చింది. ఎవరైనా తన పాత బుక్ చేసిన టిక్కెట్‌లను రద్దు చేయాలనుకుంటే, కస్టమర్ కేర్ హెల్ప్‌లైన్ నంబర్, ఇమెయిల్ ను సంప్రదించాలని ప్రదర్శించిన మెసేజ్‌లో పేర్కొన్నారు. 14646,08044647999 & 08035734999 లేదా etickets@irctc.co.in ఈమెయిల్ ప్రదర్శించారు. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలోనే సైట్ నిలిచిపోవడం అతిపెద్ద సమస్యగా మారింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఐఆర్‌సీటీసీని ట్యాగ్ చేస్తూ.. అనేక ప్రశ్నలు సంధించారు.
READ MORE: Gottipati Ravi Kumar: వైఎస్ జగన్ హయాంలోనే ఏపీ జెన్కో సర్వనాశనం అయ్యింది!
ఇదిలా ఉండగా.. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ సేవల్లో అంతరాయం కలగడం ఈ నెలలో ఇది రెండో సారి. డిసెంబర్ 9న కూడా యాప్, వెబ్‌సైట్ దాదాపు రెండున్నర గంటల పాటు నిలిచిపోయాయి. దీంతో చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పీక్ టైమ్‌లో వెబ్‌సైట్, యాప్ ఇలా ఇబ్బందులకు గుర్తి చేస్తే ఎలా అని ప్రశ్నించారు. రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రి, పీఎంవోని ఎక్స్‌లో ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు.