స్వలింగ సంపర్కానికి సంబంధించిన చట్టాన్ని ఇరాక్ పార్లమెంటులో శనివారం నాడు ఆమోదించారు. ఇరాక్ పార్లమెంట్ స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించింది. ఈ చట్టం ప్రకారం, స్వలింగ సంపర్కం కలిగి ఉన్న వారికి 15 సంవత్సరాల శిక్షను కూడా విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇరాక్ పార్లమెంట్ మతపరమైన విలువల ఆధారంగా ఈ చట్టాన్ని ఆమోదించింది. ఇరాక్ పార్లమెంట్ కూడా వ్యభిచారంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
Read Also: Jammu Kashmir : రాంబన్‌లో మూడో రోజు కుంగుతున్న భూమి.. సురక్షిత ప్రాంతాలకు 100కుటుంబాలు
ఇక, లెస్బియన్ కమ్యూనిటీ, పాశ్చాత్య దేశాలు ఇరాక్ యొక్క ఈ చట్టంపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేశాయి. ఇరాక్ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇరాక్‌లో స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించే వారు కూడా శిక్షించబడతారని ఆ దేశ పార్లమెంట్ వెల్లడించింది. ఈ నిర్ణయం పట్ల తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తం అవుతాయని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ మార్పు రాజ్యాంగ పరంగా రక్షించబడిన మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛలకు ముప్పు అని చెప్పుకొచ్చారు. అయితే, లెస్బియన్ (LGBTI) కమ్యూనిటీ సభ్యులపై వివక్ష, హింస యొక్క చట్టబద్ధ గత కొన్ని సంవత్సరాలుగా ఇరాక్ లో సమర్థవంతంగా విధిస్తుందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పరిశోధకుడు రాజవ్ సాలిహి అన్నారు. ఇరాక్ తీసుకున్న ఈ నిర్ణయంపై హ్యూమన్ రైట్స్ వాచ్ సభ్యుడు సారా సంబర్ కూడా తీవ్రంగా ఖండించారు.