iQOO Z9 Lite 5G: అదిరిపోయే ఫీచర్లతో ఆకర్షణీయమైన ధరతో రానున్న iQOO Z9 లైట్…
- iQOO Z9 లైట్ ను వచ్చే వారం ప్రారంభంలో లాంచ్.
- ఫోన్‌ను కేవలం రూ.10 వేల లోపు ధరతో విడుదల చేయనుంది.
- స్మార్ట్‌ఫోన్ 2 రంగు ఎంపికలలో వస్తుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO Z9 Lite 5G : iQOO కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Z9 లైట్ ను వచ్చే వారం ప్రారంభంలో లాంచ్ చేయబోతోంది. మంచి ఫీచర్లతో ఆకర్షణీయమైన ధరతో రానున్న ఈ ఫోన్‌ను కంపెనీ జూలై 15న విడుదల చేయనుంది. బ్రాండ్ యొక్క Z9 సిరీస్ లో ఇది చౌకైన ఫోన్. ఇది అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. దాని మైక్రోసైట్ లలో ఒకటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో కూడా కనిపించింది. ఫోన్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ దాని ధరను కూడా తెలిపింది. ఈ ఫోన్‌ను కేవలం రూ.10 వేల లోపు ధరతో విడుదల చేయనుంది. దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Shocking Viral Video: భారీ గేటు ఎక్కి పారిపోయిన 92 ఏళ్ల బామ్మ.. షాకింగ్ వీడియో!
Also Read
- Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
- Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. 'భోగి' వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
- Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
- Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్‌గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
ఈ ఫోన్ ధరను కంపెనీ ధృవీకరించలేదు. కాకపోతే ఇది ఇప్పటివరకు ఉన్న బ్రాండ్‌లో అత్యంత చౌకగా ఉంటుంది. iQOO ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 10 వేల కంటే తక్కువ ధరతో విడుదల చేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ టీజర్ ను విడుదల చేసింది. కంపెనీ iQOO Z9 లైట్ 5Gని 6GB RAM,128GB స్టోరేజ్‌తో లాంచ్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 2 రంగు ఎంపికలలో వస్తుంది. మోచా బ్రౌన్, ఆక్వా ఫ్లో రంగు ఎంపికలలో వస్తుంది. iQOO Z9 లైట్ 5Gలో మనం దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్ ని పొందుతాము. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా, LED ఫ్లాష్ లైట్ ఉంటుంది. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ కుడి వైపున కనిపిస్తాయి.
Viral Video: ఎంతకు తెగించార్రా.. వరద నీటిలో భార్యలను ఎత్తుకొని మరీ..!
iQOO Z9 లైట్ 5G 6.56 అంగుళాల LCD ప్యానెల్ ను కలిగి ఉంటుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ మద్దతుతో వస్తుంది. ఇందులో వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ ఉంటుంది. స్క్రీన్ 840 నిట్ల గరిష్ట బ్రైట్నెస్ తో వస్తుంది. మీడియాటెక్ డిమెంసిటీ 6300 ప్రాసెసర్ తో ఈ స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేయనున్నారు. ఇది గరిష్టంగా 6GB RAM, 128GB నిల్వను కలిగి ఉంటుంది. ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ లెన్స్ ఉంటాయి. ముందు భాగంలో కంపెనీ 8MP సెల్ఫీ కెమెరాను పొందుపరిచింది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్‌గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్‌కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!